హీరో అజిత్ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మాస్ క్రేజ్ ఉన్న హీరో. ఇటీవల ఆయన నటించిన తమిళ చిత్రం “తునీవు”. బోనీకపూర్ నిర్మాణ సారధ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోత్ దర్శకత్వం వహించారు.అజిత్ జంటగా మంజూవారియర్ నటించింది. ఈ నెల 12వ తేదీన తమిళనాట విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘తెగింపు’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. తాజాగా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
హెలికాప్టర్లు..పవర్ బోట్లు..ఛేజింగ్స్ తో సినిమాలోని భారీతనాన్ని శాంపిల్ గా చూపించారు.
డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో అజిత్ పాత్రను డిజైన్ చేసినట్టుగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. సముద్రఖని .. అజయ్ ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించారు.
మంజూ వారియర్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొందనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.సంక్రాంతి బరిలోకి దూకుతున్న అజిత్ ‘తెగింపు’ ఎంతవినోదాన్ని పంచుతుందో, ఎంత కమర్షిల్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.