జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని చాలా మంది దొంగతనాలకు అలవాటుపడుతున్నారు. బ్యాంకుల వద్ద, ఒంటరిగా వెళ్తున్నా వారిని టార్గెట్ చేసి దోపిడి చేస్తుంటారు. అయితే, కొన్ని కొన్ని సార్లు దొంగల ప్లాన్లు కూడా బెడిసి కొడుతుంటాయి. ఎన్నో రోజులు నుంచి తప్పించుకుని తిరుగిన కొన్ని సార్లు సులువుగా పోలీసులకు దొరికిపోతుంటారు.
తాజాగా ఓ దొంగ కూడా బాధితుడి కళ్లలో కారం పొడి కొట్టి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. కానీ చివరికి స్థానికుల చేతిలో చావు దెబ్బలు తని కట్టకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే..
గుంటూరు జిల్లాలోని బ్రాడిపేటలో సోమవారం భారీ దొంగతనం జరిగింది. స్థానిక ఇండియన్ బ్యాంక్ నుంచి ఓ వ్యక్తి లక్ష 80 వేల రూపాయల డబ్బు విత్ డ్రా చేశాడు. అయితే, ఈ విషయాన్ని గమనించిన దుండగుడు అతడి కళ్లలో కారం పొడి కొట్టి డబ్బును లాక్కొని పారిపోయాడు. బాధితుడు తేరుకునేలోపే దొంగ కనిపించకుండా వెళ్లిపోయాడు.
అయితే, దుండగుడు పారిపోయే క్రమంలో అరుండల్‌పేట బ్రిడ్జిపై కింద పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు దొంగను పట్టుకుని దేహాశుద్ధి చేశారు. అనంతరం అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. విక్టర్ ఇమ్మాన్యూయేలు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.