స్టార్ హీరోల సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఇప్పుడు యూట్యూబ్ చానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలు వైరల్ గా మారాయి. హీరోలతో తమకు షూటింగ్ లో ఉన్న అనుభవాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇలా ఎన్నో అంశాలను వాళ్ళు మీడియాతో పంచుకుంటున్నారు. తాజాగా సంఘవి అనే హీరోయిన్ తనకు హీరో విజయ్ తో ఉన్న ఒక జ్ఞాపకాన్ని ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
విజయ్ సంఘవి కాంబినేషన్ లో కొన్నేళ్ళ క్రితం ఒక సినిమా విడుదల అయింది. రసిగన్ అనే సినిమా రాగా ఆ సినిమాకు స్వయంగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సినిమా షూటింగ్ లో భాగంగా ఒక సంఘటన ఆమె బయట పెట్టారు. ఒక సన్నివేశంలో భాగంగా చెరువులో నేను విజయ్ రొమాంటిక్ సీన్ లో నటించాల్సి ఉందని అయితే ఆ సీన్ లో తాను బాగానే నటించినా విజయ్ మాత్రం సరిగ్గా చేయలేదన్నారు.
ఆ సమయంలో సరిగ్గా రొమాన్స్ చేయలేదని విజయ్ తండ్రి విజయ్ ను తిట్టారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సన్నివేశంలో నటించడం కోసం విజయ్ పడిన ఇబ్బంది అంతాఇంతా కాదన్నారు ఆమె. ఇక సంఘవి ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చినా అనుకున్న విధంగా ఫలితం రావట్లేదు. కాగా విజయ్ నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఈ సినిమా విడుదల చేస్తున్నారు.