ఇతర భాషల్లో ఏమో గాని మన తెలుగులో మాత్రం స్టార్ హీరోల సినిమాలకు సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే చాలు పూనకమే. ఎంత బిజీగా ఉన్నా సరే సంక్రాంతికి సినిమా విడుదల చేయాల్సిందే అన్నట్టుగా స్టార్ హీరోలు ఉంటారు. ఈ వరుసలో బాలకృష్ణ, చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరి మధ్య పోటీ ఎప్పటి నుంచో అలాగే ఉంది. ఇప్పుడు బాలకృష్ణకు క్రేజ్ కాస్త ఎక్కువగా ఉంది.
దీనితో ఏ రేంజ్ లో ఉంటుంది పోటీ అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంచితే ఒకసారి వెంకటేష్, చిరంజీవి మధ్య ఉన్న పోటీతో బాలకృష్ణకు థియేటర్లు దొరకలేదు. అసలు ఏంటీ ఆ కథ అనేది చూద్దాం. 2001 సంక్రాంతి పండుగ సమయంలో చిరంజీవి మృగరాజు సినిమా విడుదల అయింది. అలాగే వెంకటేష్ హీరోగా దేవీపుత్రుడు సినిమాను విడుదల చేసారు.
దీనితో హైదరాబాద్ లో నరసింహ నాయుడు సినిమాకు విడుదల చేయడానికి 14 థియేటర్లు మాత్రమే ఉండటంతో ఫాన్స్ బాధ పడ్డారు. అయితే ఆ రెండు సినిమాల కంటే బాలకృష్ణ సినిమాకు మంచి టాక్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ అని మౌత్ పబ్లిసిటీ బాగా జరిగింది. దీనితో థియేటర్ లను భారీగా పెంచారు. ఆ హాల్స్ లో ఉన్న సినిమాలను తీసేసి ఈ సినిమాను ఆడించడంతో నిర్మాతతో పాటుగా సినిమాను కొన్న వారికి భారీగా లాభాలు వచ్చాయి.