నారగోని ప్రవీణ్ కుమార్.. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. రాష్ట్రంలో పేరుకుపోయిన అనేక సమస్యలపైన బీజేపీ తమ వైఖరిని తెలియజేయాలి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు 26 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలి.
ధరణి పోర్టల్ రద్దు చేయాలి. 10 లక్షల మంది రైతులు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుచున్నారు. సాదా బైనామాలు ఉండి భూమి దున్నుకునే రైతులు లక్షల్లో ఉన్నారు. ఎలాంటి చెల్లింపులు లేకుండా కాస్తు మీదున్న రైతుల పేరు మీదకు భూమి మార్చాలి. గ్రామ పంచాయితీ లేఅవుట్లలోని కొత్త ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలి.
ఎల్ఆర్ఎస్ లేని గ్రామ పంచాయితీల్లోని ప్లాట్లలో ఇళ్లు కట్టుకునేందుకు పర్మీషన్ ఇవ్వాలి. 25 లక్షల అసైన్డ్ భూమి 15 లక్షల మంది రైతుల చేతిలో ఉంది. వారికి శాశ్వత హక్కు అంటే అమ్ముకునే హక్కును కల్పించాలి. పోడు భూముల రైతులకు పట్టాలు అందించాలి.
60 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. రాష్ట్రంలో పంట పండించేది వారే. వారి కష్టానికి తగిన ఫలితం లభించడం లేదు. వారికి ఏం సహాయం చేస్తారో చెప్పాలి. రాష్ట్రంలో 12 లక్షల మంది రియల్టర్స్ ఉన్నారు. వారికి గుర్తింపును ఇవ్వాలి. ప్రతి జిల్లాకు రియల్ ఎస్టేట్ భవనం కట్టుకోవడానికి భూమి కేటాయించాలి.