చాలా మందికి పెరుగు అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు. పెరుగు విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా సరే కొందరు తినడానికి ఇష్టపడరు. అయితే పెరుగు ఎవరు తినొచ్చు, తింటే మంచిదా కాదా అనేది ఒకసారి చూస్తే… శరీరానికి మేలు చేసే పదార్థాలలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. ఇందులో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఎముకలకు చాలా మంచిది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను అధిక రక్తపోటు క్రమంగా తగ్గించే అవకాశం ఉంటుంది.
Also Read:అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్…. పెద్ద కథే ఉందిగా !!
పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు కాకుండా, చర్మానికి జుట్టుకి కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇక కొంతమందికి పెరుగు తీసుకోవడం అనేది ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని వ్యాధులు ఉన్నవారు పెరుగు తీసుకోవడం వెంటనే మానేయడం మంచిది. ఇక పెరుగుని అవసరానికి మించి తీసుకుంటే అనవసర సమస్యలు వస్తాయి. పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలకు దంతాలకు చాలా మంచి చేస్తుంది.
అయితే పెరుగు తీసుకోవడం కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఏ మాత్రం మంచిది కాదు. ఆర్థరైటిస్ రోగులు పెరుగు తీసుకోవడం మానేయడమే మంచిది. క్రమంగా మజ్జిగ తాగడం మంచిది. ఇది నొప్పిని చాలా తీవ్రతరం చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు పెరుగు తినడం మంచిది కాదు. ఆస్తమా రోగులు కూడా పెరుగు తీసుకోవడం మంచిది కాదు.పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటిపూట మాత్రమే కొంచెం తినాలి. రాత్రిపూట పెరుగు తినడం మంచిది కాదు. ఇక అసహనం ఎక్కువగా ఉండే వాళ్ళు పెరుగు తినడం మంచిది కాదు.
అసిడిటీ సమస్య ఉన్నవారు కూడా తినడం మంచిది కాదు.
Also Read:యాదాద్రిలో కేసీఆర్.. ప్రత్యేక పూజలు