మన దేశంలో జనాలకు పెద్దగా చట్టాల మీద అవగాహన ఉండదు. తప్పు చేస్తే పోలీసులు కేసు పెడితే మళ్ళీ భయపడి తిట్టడం, శపించడం జరుగుతూ ఉంటాయి. కాని మనం తెలుసుకోవాల్సిన కొన్ని చట్టాలు ఇండియాలో ఉన్నాయి. అవి ఏంటీ అనేది ఒకసారి చూస్తే…
Also Read:మహేష్ బ్యాంక్ సైబర్ దాడి కేసు.. పెద్ద ప్లానే..!
1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టం ప్రకారం గాలిపటం ఎగురవేస్తే లోపల పెడతారు. 2 ఏళ్ళ జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. పది లక్షల వరకు జరిమానా కూడా ఉంది. అయితే ఈ చట్టంలో 2008 లో కొన్ని మార్పులు చేసారు.
రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు చెత్త వేసినా కూడా జరిమానా విధిస్తారు. మనకి కూడా రోడ్ మీద లేదా ఎక్కడన్న పబ్లిక్ ప్రాపర్టీ లో చెత్త వేస్తే ఇండియన్ పీనల్ కోడ్ 278 ప్రకారం 500 జరిమానా వేసే అవకాశం ఉంది.
రోడ్ల మీద మూత్రం వచ్చిన సమయంలో మనకు ఏదైనా స్టార్ హోటల్ కనపడితే అందులోకి వెళ్లి 1867 సరైస్ ఆక్ట్ ప్రకారం బాత్రం వాడుకోవచ్చు. డబ్బులు కట్టే అవసరం లేదు దానికి. ఒక గ్లాసు మంచి నీళ్ళు కూడా తాగి రావొచ్చు.
పబ్లిక్ లో ముద్దు పెట్టుకుంటే… ఎవరైనా కేసు పెడితే అది చెల్లుతుంది.
అదే విధంగా ఎవరన్నా పోలీస్ మిమల్ని తప్పుడు కేసు లో ఇరికిస్తే మాత్రం.. మీరు వారి మీద సెక్షన్ 211 పెట్టి .. వారి ఉద్యోగం పోయే విధంగా జైలులో పెట్టించే అధికారం మీకు ఉంది.
Also Read:లఖీంపూర్ కేసులో కీలక పరిణామం