బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకి గతేడాది వచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక ఈ సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలెట్ గా నిలిచాయి. ఒక గుహలో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంటర్వెల్ బ్యాంగ్ ను ప్లాన్ చేశారు. అయితే ఈ సీన్ కోసం ఎంత కష్టపడ్డారో అంత టెన్షన్ పడ్డామని సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ స్వయంగా చెప్పారు.
నిజానికి గతంలో బాలయ్య సినిమాలకు బి.ఎస్.ఆర్ స్వామి సినిమాటోగ్రాఫర్ గా ఉండేవారు. ఆ తర్వాత రాంప్రసాద్ కంటిన్యూ అవుతున్నారు. ఇకపోతే అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్ అరకులోని గుహలో షూట్ చేయాలని బోయపాటి రామ్ ప్రసాద్ కు సూచించారట. అయితే అరకు టూరిస్ట్ స్పాట్ అక్కడి గుహలు అందరూ ఇప్పటికే చూసేసి ఉంటారు. కాబట్టి కొత్తగా ఉండాలని లోపల గుహలో సెట్ వేశారట.
ALSO READ : ప్రత్యేక విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోస్ ఎవరో తెలుసా ?
అలాగే ఆ విజువల్స్ హై ఫ్రేమ్ రేట్ లో ఉండాలని ఆ సీన్లు డే టైం షూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. కానీ డార్క్ మోడ్ లో షూట్ చేయాల్సి రావడంతో గుహలో భారీ ఎత్తున లైట్లు వేసి షూట్ చేశారట. లోపల లైట్లు కోసం 20 జనరేటర్లు పెట్టి రోజుకు నాలుగు వేల లీటర్ల డీజిల్ ఖర్చు చేసి షూట్ చేశారట. ఇదే విషయాన్ని స్వయంగా చెప్పారు రాంప్రసాద్.
మేము ఓవైపు షూటింగ్ చేస్తుంటే మరోవైపు లైట్స్ హిట్ అవుతున్నాయని కొందరు చెబుతుండేవారని, ఫైట్ మాస్టర్ లకు కూడా ఆ ప్రేమ్ రేటింగ్ లో చేస్తేనే క్వాలిటీ వస్తుందని పక్కన ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం టైం టేకింగ్ తీసుకున్నానని అన్నారు.
ALSO READ : పెళ్లి చేసుకునే స్త్రీ, పురుషుల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి !!
అందువల్లే ఆ సీన్లు అంత క్వాలిటీగా వచ్చాయని చెప్పుకొచ్చారు. సెట్ అంతా వాటర్ స్ప్రే చేసి ఆలీవ్ గ్రీన్ కొట్టి రిఫ్లెక్షన్ క్యాప్చర్ చేశామని అలాగే నటీనటుల ఫేస్ కు జెల్ రాసి రిఫ్లెక్షన్ లోనే తాము సూట్ చేశామన్నారు. ఆ సన్నివేశాలను పూర్తి చేసేటప్పుడు కాస్త టఫ్ అనిపించిందని చెప్పుకొచ్చారు. రాంప్రసాద్ మాటలు వింటే ఆ సీన్ కోసం వారు ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది.