జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలో గోల్డ్ డిమాండ్ తగ్గినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఆ సంస్ద ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. 2022 మొదటి త్రైమాసికంలో బంగారంపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదని నివేదికలో పేర్కొంది.
ఇటీవల బంగారు ధరలు పెరగడం, వివాహ ముహుర్తాలు లేకపోవడంతో ప్రజలు బంగారంపై పెద్దగా మక్కువ చూపలేదని వెల్లడించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం అమ్మకాలు తగ్గాయని చెప్పింది.
ద్రవ్యోల్బణ కారణంగా భారతీయుల్లో గోల్డ్ పై ఆసక్తి తగ్గిపోతోందని వివరించింది. నివేదిక ప్రకారం… ప్రస్తుత ఏడాది జనవరి-మార్చిలో గోల్డ్ డిమాండ్ 18శాతం తగ్గింది.
ఇదే సమయంలో రీసైక్లింగ్ గోల్డ్ కు డిమాండ్ 88శాతం పెరిగింది. బంగారానికి డిమాండ్ తగ్గడంతో 58శాతం తగ్గి దిగుమతులు 132.2 టన్నులకు చేరుకున్నాయి.