మాఫియా బెడద ముంబైని ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. ఇప్పడు పావురం కూడా ముంబైని భయపెడుతుంది. పావురం ముంబైని భయపెట్టడం ఏంటనుకుంటున్నారా..! వీటి కారణంగా ముంబై మహానగరంలో హైపర్ సెన్సిటివిటీ 5రెట్లు పెరిగింది.
హైపర్ సెన్సిటివిటీతో అక్కడ చాలామంది చనిపోయారు. సినీ నటి మీనా భర్త చనిపోవడానికి కారణం కూడా హైపర్ సెన్సిటివీటీ కారణమని వైద్యలు తేల్చారు. పావురం ఏంటి?!ఈ హైపర్ సెన్సిటివిటీ ఏంటి.?! అసలు పావురానికీ హైపర్ సెన్సిటివిటీ కారణం ఏంటి ? అని డౌట్ల మీద డౌట్లు వస్తున్నాయి కదా..?!
సాధారణంగా పావురాలు ఇంటి పైకప్పుల మీద విసర్జిస్తాయి.ఆ విసర్జితాలు మట్టిలో కలిసిపోతే మొక్కలకు ఎరువులుగా మారిపోతాయి. కానీ పావురాలు ఇంటిపై కప్పులు,కిటికీలలో విసర్జించడం వల్ల మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
అయితే పావురాల విసర్జనలో హిస్టాఫ్లాస్మా అనే ఫంగస్ ఉంటుంది. దీని కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ‘హైపర్ సెన్సిటివ్ న్యుమోనైటిస్’ లేదా ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అనే ఊపిరితిత్తుల వ్యాధి వచ్చేప్రమాదం ఉందంటున్నారు.
దీని లక్షణాలు న్యుమోనియాకు దగ్గరగా ఉంటాయి. దగ్గు,జ్వరం,కీళ్ళ నొప్పులు. శ్వాసాడకపోవడం వంటి సమస్యలు పుట్టుకొస్తాయి. పావురాలు విసర్జించిన తర్వాత అవి ఎండిపోయి చిన్న చిన్న కణాలుగా మారిగాల్లో కలిసిపోతాయి.
ఆ కణాలను శ్వాసించడం ద్వారా అవి ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు,కోవిడ్ బారినపడి కోలుకున్నవారు, పావురాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వీటి దుష్ప్రభావం వల్ల విదేశాల్లో పావురాలను నిషేధించారు.లండన్ లో పావురాలకు దాణావేస్తే 500 పౌండ్లు జరిమానా విధిస్తారు. ఇక 2019 సంవత్సరం హైదరాబాద్ జీ.హెచ్.ఎమ్.సీ పరిధిలోని అన్ని హార్టీకల్చర్ పార్కుల్లో పావురాలకు ఆహారం వేయడాన్ని నిషేధించారు.
పావురాలు ఎక్కువగా ఉండే మొజంజాహి మార్కెట్లో పావురాల దాణాకోసం విక్రయిస్తున్న జొన్నలు తృణ ధాన్యాలను అధికారులు భారీమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అది మాత్రమే కాదు, వందలకొద్దీ పావురాలను పట్టి అడవుల్లో విడిచిపెడుతున్నారు.
ఇక 2020లో కూడా నగరంలో పావురాలను పూర్తిగా నిషేధించాలని కొందరు డిమాండ్ చేసారు. కానీ సదరు చర్యలన్నీ నామమాత్రంగా నడిచి కొద్దిరోజులకే పావురాలతో పాటు అటకెక్కాయి. ఇప్పటికీ మెట్రోపిల్లర్లపై వందల సంఖ్యలో పావురాళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి.
కనుక అధికారులు చిత్తశుద్ధి కరువైతే అది మనుషుల ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి మీ ఇంటి పరిసరాలు చేరకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సింది మీరే. పావురాలకు ఆహారమిస్తూ వాటికి దగ్గరగా ఉండడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్య.