వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపైనే తన యుద్దాన్ని జరిపారు. పార్టీలో జరుగుతున్న ప్రతీ సూచనను చూపుతూ ఏపీలో రెబల్ గా మారారు. ఇటీవల తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారారు కృష్ణంరాజు. అయితే ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కౌంటర్ కు ఎన్ కౌంటర్ అన్నట్టు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణంరాజు తగ్గేదే లే అన్నట్టు ట్విట్టర్ ను వేదికగా చేసుకొని విమర్శల జల్లు కురిపిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఆయన ఢిల్లీ నుంచి మీడియా సమావేశాలు నిర్వహించడంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఓ నేత ప్రేమ కోసం రఘురామ కృష్ణంరాజు పడరాణి పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘ఎవరి మెప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా..? అని ప్రస్తావించారు. 40 ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్లకు ప్రేమ బాణాలు వేస్తుంటే.. అతడి ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా..? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో నిలబడి కాకమ్మ కబుర్లు చెబితే.. అదే ప్రజలు రాళ్లతో కొడతారు’ అని విమర్శలు గుప్పించారు.
అయితే.. విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు రఘురామకృష్ణంరాజు కూడా కౌంటర్ ఇచ్చారు. ‘నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవయువతుల మీద విసురుతున్నావు అంట కదా.. పని చేయకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో’ అంటూ రఘురామ కృష్ణంరాజు చురకలు అంటించారు.