ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. ఇప్పటికే డెల్టా వైరస్ తో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ దేశవ్యాప్తంగా విరుచుకుపడుతోంది. కానీ.. కరోనా టెస్టులు చేయడంలో గందరగోళం ఏర్పడుతుంది. గతంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే వారిని కలిసిన అందరికీ పరీక్షలు తప్పనిసరిగా చేయించాల్సి వచ్చేది.
అయితే, ప్రస్తుతం కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు ఏర్పడటం లేదు. అందువల్ల కరోనా టెస్ట్ ల విషయంలో ఏమి చేయాలి అనేదానిపై ఐసీఎంఆర్ స్పష్టత ఇచ్చింది. కోవిడ్ పరీక్ష కోసం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కరోనా టెస్ట్ సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
దీని ప్రకారం, రిస్క్ కేటగిరీలో ఉంటే తప్ప.. కరోనా సోకిన వారితో పరిచయం ఉన్న వ్యక్తులను పరీక్షించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. దగ్గు, జ్వరం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నవారు.. వాసన, రుచి సమస్యలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలన్నారు. మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలు.. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న 60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పరీక్షించుకోవాలని సూచించారు.విధేశాలకు వెళ్లు వారు.. భారతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు వచ్చే విదేశీ ప్రయాణికులను మార్గదర్శకాల ప్రకారం పరీక్షిస్తారని వెల్లడించారు.
ఇన్ఫెక్షన్ లక్షణాలు లేని వ్యక్తులు, వారికి పరీక్షలు అవసరం లేదు. వయస్సు, వ్యాధుల ఆధారంగా రిస్క్ కేటగిరీలోకి వస్తే తప్ప, వ్యాధి సోకిన వ్యక్తి ఎవరెవరిని పరీక్షించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాల ఆధారంగా డిశ్చార్జ్ అయిన రోగులకు, దేశీయ ప్రయాణాల కోసం అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించే వారికి కూడా పరీక్ష అవసరం లేదని వెల్లడించారు.