రష్మిక ఈ హీరోయిన్ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంది. కిరిక్ పార్టీ సినిమాతో కోలీవుడ్ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కోలీవుడ్లో అవకాశాలు రాకపోయినా తెలుగు, హిందీలలో అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ఈమె నటించిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో నేషనల్ క్రష్ గా పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఈమెకు ఆఫర్లు వెలువెత్తాయి. అమితాబచ్చన్, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది.అలాంటి ఈ హీరోయిన్ కేవలం సినిమాల్లోనే కాకుండా చాలా ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది.
ఇక ఈమె పెద్ద పెద్ద బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఓ వైపు సినిమాల్లో మరోవైపు యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం రష్మిక రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో అలాగే అల్లు అర్జున్ తో పుష్ప -2 సినిమాలో నటిస్తోంది. ఇదే కాకుండా తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోయే నితిన్ సినిమాలో హీరోయిన్ గా కూడా రష్మిక ఫిక్స్ అయింది.
కలిసొచ్చిన కాలాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన రష్మిక లోనూ కనిపిస్తుంది. అందుకే ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత తన పారితోషికాన్ని ఆమె బాగా పెంచేసిందని పరిశ్రమలో టాక్ వినిపిస్తున్నది. ఆమె తన కొత్త సినిమాలకు 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నదట. గతంలో నాయికలు కోటి రూపాయలు తీసుకుంటేనే ఆశ్చర్యపోయేవారు.
బాలీవుడ్ తారలకు మాత్రమే ఈ స్థాయి ఫీజులు ఉండేవి. దక్షిణాది సినిమా దేశీయంగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో స్థానిక తారలూ ఆదాయం విషయంలో ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు వారి క్రేజ్ పాన్ ఇండియాకు చేరడంతో పారితోషికాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి.