సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రమ్యకృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ. ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను బ్రేక్ చేసింది. కే ఎస్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. నీలంబరి పాత్రలో రమ్యకృష్ణ నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందాయి.
అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్య ముఖం పై కాలు పెట్టే ఒక సీన్ ఉంటుంది. దీనికి సంబంధించి అప్పట్లో చాలా రూమర్లు తెరపైకి వచ్చాయి. కానీ సినిమా దర్శకుడు కే ఎస్ రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ నిజాలు అప్పట్లో బయటపెట్టారు.
ఈశాన్యంలో బరువులు పెట్టకూడదంటారు..ఎందుకో తెలుసా ?
మొదట నీలంబరి పాత్ర కోసం నగ్మా ను ఎంపిక చేశామని, ఆ తర్వాత మీనా పేరును కూడా పరిశీలించామని అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రమ్యకృష్ణ ను ఎంపిక చేశామని తెలిపారు. అయితే సౌందర్య ముఖం పై కాలు పెట్టే సీన్ చేయాలని చెప్పినప్పుడు రమ్యకృష్ణ చేయనని చెప్పిందని సౌందర్య చాలా పెద్ద హీరోయిన్ అని..నాకు మార్కెట్ తక్కువని అప్పుడు రమ్యకృష్ణ చెప్పినట్లు కే ఎస్ రవికుమార్ అన్నారు.
భీమ్లా నాయక్ కు ఇంత అవమానమా? పవన్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు!!
కానీ సౌందర్య మాత్రం చెయ్యాలి అని చెబుతూ రమ్యకృష్ణ కాలు ముఖం పై పెట్టుకున్నారని కే ఎస్ రవికుమార్ తెలిపారు. రమ్యకృష్ణ ఆ సమయంలో ఏకంగా ఏడ్చేసారని, ఆ షార్ట్ రియల్ గానే జరిగిందని ఎలాంటి డూప్ లు పెట్టలేదని చెప్పుకొచ్చారు.