స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించడం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంజయ్ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే.. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వికారాబాద్ సహా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
కేంద్రం ఫసల్ బీమా పథకం ద్వారా రైతులను ఆదు కుంటున్నప్పటికీ రాష్ట్రంలో దాన్ని వర్తింపచేయకుండా కేసీఆర్ అన్నదాతల పొట్టకొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.