సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్బర్ పేట-భూంపల్లి నూతన మండలంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది.
దుబ్బాక నియోజవర్గంలో అక్బర్ పేట-భూంపల్లి వద్ద డీసీసీబీ బ్యాంకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.
ఆయనతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫోటో పెట్టలేదంటూ బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ ప్రశ్నించడంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరుపార్టీలను అదుపు చేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.