ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. విభజనలో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీదని కొనియాడారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవద్దని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేమని అన్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తామని తేల్చి చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీకి వెళ్తారని పేర్కొన్నారు.
యూనివర్సిటీ సందర్శించిన తర్వాత యూనివర్సిటీ సమస్యలు..ఉద్యోగాల భర్తీ తదితర అశాలపై రాహుల్ విద్యార్థులతో మాట్లాడతారని వెల్లడించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా రాహుల్ గాంధీ విద్యార్ధులతో సమావేశమవుతారని పేర్కొన్నారు.
సోమవారం యూనివర్సిటికి వెళ్తామని అన్నారు జగ్గారెడ్డి. వీసీ ని కలిసి అనుమతి కోరుతామన్నారు. ప్రశంత్ కిశోర్ విషయంలో సందేహాలు రావడం సహజం కానీ.. అది తమ పరిది కాదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రజల శ్రేయస్సు కోరుకునే మనుషులు.. వారి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటోందని చెప్పారు జగ్గారెడ్డి.