మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడా లో అధికార పార్టీ నాయకులకు అసమ్మతి సెగ తగిలింది. స్థానిక మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ తీరుపై కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 10 మంది కౌన్సిలర్లు… మంత్రి మల్లారెడ్డి, చైర్మన్ ప్రణీత తీరుకు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కౌన్సిలర్లు అంత కలిసి రహస్యంగా శామీర్ పేట్ లోని ఒక రిసార్ట్ లో దమ్మాయిగూడా మున్సిపల్ చైర్మన్ ను దింపేందుకు మంతనాలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.