టాలీవుడ్ లో కొందరు హీరోలు కొంత కాలం పాటు మనల్ని అలరించి ఆ తర్వాత సినిమాల నుంచి కనుమరుగైన పరిస్థితి. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అవుతారు అనుకున్న వాళ్ళు ఆ తర్వాత కనపడకుండా పోయారు. అలా ఒక పది మంది హీరోల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం.
Also Read:సామ్ సంగ్ 5జీ అమ్మకాలు షురూ..!
వేణు; 90 ల చివర్లో ఈ హీరో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తొలి సినిమాతోనే అతనికి మంచి హిట్ వచ్చింది. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. కళ్యాణ రాముడు, చిరు నవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలు ఆయనకు మంచి హిట్ లు వచ్చాయి. వరుసగా విజయాలు సాధించి ఆ తర్వాత కనపడకుండా పోయాడు.
తరుణ్; అమ్మాయిలకు కలల హీరో. లవర్ బాయ్ అనే పదానికి అర్ధం చెప్పాడు. నువ్వే కావాలి సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ హీరో… అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు. ఇక ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు మాత్రం వ్యాపారాలు చూసుకుంటున్నాడు.
వరుణ్ సందేశ్; చాలా తక్కువ టైం లో మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు కనపడటం లేదు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో అతను ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ 3 లో భార్యతో కలిసి కనిపించాడు. 20 సినిమాలు చేసినా సరే అద్రుష్టం కలిసి రాలేదు.
నవదీప్; తేజా స్కూల్ నుంచి వచ్చి ఒక్క హిట్ కూడా కొట్టలేదు ఈ హీరో. చందమామ వంటి సినిమాతో దగ్గరైనా హీరోగా 15 సినిమాలు చేసినా అద్రుష్టం కలిసి రాలేదు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు.
రాజ్ తరుణ్; ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ హీరో… హ్యాట్రిక్ విజయాలతో సందడి చేసాడు. కాని ఆ తర్వాత మాత్రం అతని సినిమాలు వస్తున్నా సరే ఎవరూ చూడటం లేదు.
రోహిత్; 6 టీన్స్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో ఆ తర్వాత కనపడలేదు. హీరోగా ఒక పది సినిమాలు చేయలేదు. ఇప్పుడు బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
వడ్డే నవీన్; టాలీవుడ్ లో ఇలా కనపడి అలా వెళ్ళిపోయిన వారిలో వడ్డే నవీన్ ఒకరు. తండ్రి నిర్మాత కావడంతో అవకాశాలు వచ్చాయి. నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నాడు గాని ఎందుకో తర్వాత కనపడలేదు. ఒకప్పుడు రవితేజా కూడా ఆయన సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసాడు.
తనీష్; రవిబాబు డైరెక్ట్ చేసిన నచ్చావులే సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత నాని తో కలిసి చేసిన రైడ్ సినిమా మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత సినిమాలు చేసినా సరే ఈ హీరో పేరు పెద్దగా వినపడలేదు.
శివ బాలాజీ; టాలీవుడ్ లో హీరోగా పది సినిమాలు చేసినా సరే ప్రేక్షకులు పెద్దగా ఆదరించిన పరిస్థితి లేదు. చందమామ ఒకటే హిట్ అయింది.
జెడి చక్రవర్తి; ఒకప్పుడు మంచి సినిమాలతో ఆకట్టుకుని ఆ తర్వాత విలన్ గా కూడా చేసినా సరే అతనికి లక్ కలిసి రాలేదు.
Also Read:టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇదే..!