ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే గుర్తుండి పోతారు. అయితే అలా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళు పాతుకుపోయిన వారిలో టాలీవుడ్ కు చెందిన నటులు ఎంతో మంది ఉన్నారు. వయసు పైబడి సినిమాలకు దూరంగా కొంత మంది ఉండగా… మరికొంత మంది మాత్రం 70 ఏళ్లు పైబడినప్పటికీ సినిమాలలో నటిస్తున్నారు. ఇలా 70కి పైగా వయసున్న టాలీవుడ్ దిగ్గజ నటుల గురించి మాట్లాడుకుంటే మొదటిగా మన్నన బాలయ్య గురించి మాట్లాడుకోవాలి. ఈయన వయసు 91. యాక్టర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వయస్సు రీత్యా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.
అలాగే రామోజీ రావు, ప్రొడ్యూసర్ గా ఉషాకిరణ్ మూవీస్ పెట్టి రామోజీ ఫిలిం సిటీ ద్వారా కొన్ని వేల సినిమాలతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఈయన వయస్సు 85 సంవత్సరాలు. మరో నటి శారద ఈమె వయసు 77 సంవత్సరాలు, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి వద్దే ఉంటున్నారు. కైకాల సత్యనారాయణ ఈయన వయస్సు 87 సంవత్సరాలు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దే ఉంటున్నారు. అప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్నో సినిమాల్లో నటించారు సత్యనారాయణ.
ఆచార్య లో చిరంజీవి పక్కన నటించిన ఘట్టమ్మ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా
కె విశ్వనాథ్… శంకరాభరణం, స్వయంకృషి, శుభసంకల్పం వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈయన కూడా వయస్సు రీత్యా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వాణిశ్రీ… ఈమె వయస్సు 74 సంవత్సరాలు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు స్టార్ హీరోలుగా ఉన్న సమయంలో నెంబర్వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఈమె కూడా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. సరైన పాత్ర పడితే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
హీరో గోపీచంద్ నాన్న డైరెక్షన్ చేసిన సినిమాలు ఏవో తెలుసా ?
మరో హీరోయిన్ జమున, ఈమె వయస్సు 86 సంవత్సరాలు. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే 100కు పైగా చిత్రాలలో నటించింది. అలాగే శరత్ బాబు, వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించాడు. రమాప్రభ, 75 ఏళ్ల వయసున్న ఈమె చాలా చిత్రాల్లో నటించారు. అలాగే కృష్ణంరాజు వయస్సు 83 ఏళ్లు. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ గిరిబాబు, మొన్నటి వరకూ సినిమాల్లో యాక్టివ్ గా నటించారు. ఈయన వయస్సు 83 సంవత్సరాలు. ప్రస్తుతం ఇంటివద్ద గడుపుతున్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు… 81ఏళ్లు. ఇప్పటికి కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఫంక్షన్స్ లో సినిమా ఈవెంట్ లలో కనిపిస్తున్నారు. మరొక నటుడు చలపతిరావు వయస్సు 78 ఏళ్లు. ఈయన కూడా వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అలాగే నటి అన్నపూర్ణ 74 ఏళ్లు, ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఎఫ్ 3 లో కూడా చేసింది. మరో నటుడు చంద్రమోహన్ వయస్సు 77 సంవత్సరాలు. ఈయన కూడా వచ్చిన అవకాశాలను వదలకుండా సినిమాలు చేస్తున్నారు. అలాగే మురళీమోహన్, సీనియర్ హీరో కృష్ణ కూడా వయస్సు రీత్యా సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ అభిమానులలో ఆనందం నింపుతున్నారు.