అంతర్జాతీయ క్రికెట్ లో ఏ జట్టుకి అయినా సరే కెప్టెన్ చాలా కీలకం. ఆటగాళ్ళు ఎంత సమర్ధవంతంగా ఉన్నా సరే కెప్టెన్ సరిగా లేకపోతే జట్లు ఇబ్బంది పడతాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టీం పెయిన్ విషయంలో అదే జరిగింది. జట్టులో బలమైన ఆటగాళ్ళు ఉన్నా సరే అతను వాడుకోలేకపోవడంతో ఆ జట్టు కీలక మ్యాచ్ లను చేజార్చుకుంది. అందుకే కెప్టెన్ ల విషయంలో చాలా దేశాలు అలెర్ట్ గా ఉంటున్నాయి.
ఇప్పుడు మన ఇండియన్ టీం కెప్టెన్ ని కూడా టీం ఇండియా యాజమాన్యం మార్చింది. ఎన్నో విజయాలు అందించిన కోహ్లీని పక్కన పెట్టి వైట్ బాల్ క్రికెట్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఇప్పుడు మన రెడ్ బాల్ క్రికెట్ కు అంటే టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండగా వైట్ బాల్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. అసలు ఇలా రెండు కెప్టెన్ లు ఉన్న జట్లు ఏంటో ఒక్కసారి చూద్దాం.
ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాకు ప్యాట్ కమ్మిన్స్ రెడ్ బాల్ కు ఉండగా వైట్ బాల్ కు ఆరోన్ ఫించ్ కెప్టెన్ గా ఉన్నాడు.
శ్రీలంక టెస్ట్ కెప్టెన్ గా కరుణ రత్నే ఉండగా వన్డే జట్టుకి శనక నాయకత్వం వహిస్తున్నాడు.
ఇంగ్లాండ్ జట్టుకు టెస్ట్ కెప్టెన్ గా జో రూట్ ఉండగా వన్డే జట్టుకు మోర్గాన్ నాయకుడిగా ఉన్నాడు.
సౌత్ ఆఫ్రికా జట్టుకి డీన్ ఎల్గర్ టెస్ట్ కెప్టెన్ కాగా టెంబ బవుమ వైట్ బాల్ కెప్టెన్ గా ఉన్నాడు.
వెస్టిండీస్ జట్టుకి బ్రాట్ వైట్ టెస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు. వైట్ బాల్ కు గానూ పోలార్డ్ నాయకుడిగా ఉన్నాడు.
ఇక న్యూజిలాండ్ జట్టుకి రెండు ఫార్మాట్ లకు విలియమ్సన్ నాయకుడిగా ఉండగా అదే తరహాలో పాక్ జట్టుకి కూడా బాబర్ ఆజం నాయకత్వం వహిస్తున్నాడు.