ఇప్పుడు సినిమా హిట్ అంటే వంద రోజులు ఆడటం కాదు… వందల కోట్ల వసూళ్లు సాధించడం. అందుకోసం దర్శక నిర్మాతల నుంచి చిన్న నటుల వరకు పెద్ద ఎత్తున సినిమాలను ప్రచారం చేయడం చూస్తున్నాం. భారీ బడ్జెట్ పేరుతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకులు, నిర్మాతలు. ఇలా మన దేశంలో వందల కోట్లు ఖర్చు చేస్తే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు వచ్చిన సినిమాలు చూద్దాం.
బాహుబలి
ఈ సినిమా రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. రెండో భాగానికి 250 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
కేజిఎఫ్ 2
ఈ సినిమా కోసం 300 కోట్ల వరకు ఖర్చు చేయగా 1200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. గత ఏడాది ఈ సినిమా ఎన్నో సంచలనాలు నమోదు చేసింది.
పఠాన్
గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ కి ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.