ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వారి వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా అనేక రకాల ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. అయితే జపాన్ వాసులు కూడా ఇలాగే ఓ వెరైటీ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. దాని పేరేంటో తెలుసా ? పెనిస్ ఫెస్టివల్. అవును, వింతగా ఉన్నా ఇది నిజమే. అక్కడి ప్రజలు ఈ ఫెస్టివల్‌ను కనమర మత్సురి పేరిట జరుపుకుంటారు. ఆ పదాలకు అర్థం ఏమిటంటే.. ది ఫెస్టివల్ ఆఫ్ ది ఫాలస్ ఆఫ్ స్టీల్.. అని చెబుతారు.
ఇక ఈ ఫెస్టివల్‌ను ప్రతి ఏడాది అక్కడ ఏప్రిల్ నెల మొదటి ఆదివారం రోజు జరుపుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో శిశు జననాల రేటు ఎక్కువగానే ఉంది. కానీ జపాన్‌లో ఇది తక్కువ శాతంగా ఉంది. దంపతులు పిల్లలను కనేందుకు ఇష్టపడడం లేదు. వారికి టైమ్ లేక అలా జరుగుతుందా, లేక డబ్బు లేదా లేక పిల్లలు కనడం అంటే ఆసక్తి లేదా.. అనే వివరాలు మాత్రం తెలియవు. కానీ పిల్లలు అక్కడ తక్కువగా జన్మిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లల్ని కనేందుకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఏటా ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడం మొదలు పెట్టారు. ఇక సంతానం లేని వారు కూడా ఈ ఫెస్టివల్‌లో సంతానం కోసం పాల్గొంటుంటారు.
కాగా జపాన్‌లో చిన్నారుల డైపర్ల కన్నా అడల్ట్ డైపర్లనే ఎక్కువ మంది కొంటుంటారు.
భూమిపై అత్యంత ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు జపాన్‌లోనే ఉన్నారు. ఒక వ్యక్తి వయస్సు 117 ఏళ్లు కాగా మరొకరి వయస్సు 116 ఏళ్లు.
ప్రపంచంలో నేరాల రేటు అత్యంత తక్కువ ఉన్న దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ నేరాలు చాలా తక్కువగా జరుగుతుంటాయి.
జపాన్‌లో 6,852 చిన్న చిన్న దీవులు ఉన్నాయి.
జపాన్‌లో ప్రజలు తమ ఇళ్లను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకుంటారు. అయితే ఇతరులను వారు సాధారణంగా తమ ఇళ్లలోపలికి ఆహ్వానించరు. అందుకు కారణాలు తెలియదు. కానీ అది ఆచారం అని కొందరు అంటారు. కాదు.. వారు తమ వారసత్వ సంపదను పరిరక్షించుకునేందుకే అలా చేస్తారని ఇంకొందరు అంటారు.
జపాన్‌లోని స్కూళ్లలో విద్యార్థులకు శుభ్రతపై ప్రత్యేకంగా పాఠాలు ఉంటాయి. వారు స్కూల్‌లోనూ శుభ్రం చేయాల్సి ఉంటుంది.
ప్రపంచంలో ఇతర అన్ని దేశాల కన్నా జపాన్‌లోనే ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి.
స్కూళ్లలో చిన్నారులు నిద్ర పోయేందుకు జపాన్‌లో అనుమతి ఇచ్చారు.