సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం జగన్ తో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు ఉన్న సమస్యలను దృష్టి లో పెట్టుకుని ఈ టీం కొన్ని విజ్ఞప్తులతో జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది.
అందులో మొదటి – ఆమోదయోగ్యమైన టికెట్ ధరలు,
రెండవది – టికెట్ విక్రయాల్లో పారదర్శకత,
మూడవది – ప్రభుత్వ ప్రదేశాల్లో అద్దె లేకుండా సినిమా షూటింగులకు పర్మిషన్ ,
నాలుగవది – తక్కువ బడ్జెట్ చిత్రాలకు 5 షో లకు పర్మిషన్ ,
ఐదు – ఏడాది లో 15 వారాలు చిన్న సినిమాల ప్రదర్శన కు అవకాశం,
ఆరు – చిన్నచిన్న షరతులతో మినీ థియేటర్ లకు అనుమతి,
ఏడు – టాలీవుడ్ కు పరిశ్రమ హోదా,
ఎనిమిది -ఆన్ లైన్ టికెటింగ్ మరియు టికెట్ విక్రయాల్లో పారదర్శకత,
Advertisements
తొమ్మిది – స్టూడియోల నిర్మాణాలకు భూముల కేటాయింపు వంటి అంశాలను సీఎం జగన్ ముందుకు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి చూడాలి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.