మన దేశంలో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతూ ఉంటారు. అందులో వాస్తవం ఎంత ఏంటీ అనే దాని మీద కనీసం ఆలోచన ఉండదు. అసలు మన దేశంలో నిజం అనుకునే అబద్దాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాస్తవానికి వ్యభిచారం అనేది మన భారతదేశంలో చట్టపరంగా అసలు నేరమే కాదు. కానీ చాలా మంది వ్యభిచారం నేరం అని భావిస్తూ ఉంటారు. కానీ వ్యభిచారం అనేది మన భారతదేశంలో నేరం కాదు కానీ వ్యభిచారం చేయించడం మాత్రం నేరం.
Also Read:యాదాద్రిలో కేసీఆర్.. ప్రత్యేక పూజలు
కేరళలోని శబరిమలై గుడిలో మకర సంక్రాంతి నాడు మనకు కనిపించే జ్యోతి కేవలం మానవుని సృష్టి మాత్రమే అనేది చాలా మందికి తెలియదు. దాని వెనుక దేవుని మహిమ ఉందని భావిస్తారు. ఆ జ్యోతి వెనుక ఎటువంటి దేవుని మహిమ లేదు అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. సర్వే ప్రకారం ఎవరూ ఊహించని విషయం ఏంటీ అంటే… అబ్బాయిల కంటే అమ్మాయిలు రోజులో 13000 పదాలు ఎక్కువ మాట్లాడుతారని. కానీ సాధారణoగా అమ్మాయిలు తక్కువ మాట్లాడుతారనే భావనలో మనం ఉంటాం.
ఇక మనం ఎక్కువగా చూసే WWW షో అనేది ఏ మాత్రం నిజం కాదు. కావాలంటే యూట్యూబ్ లో వీడియో లు ఉంటాయి చూడండి. ఇక అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య మీద కానీ , భర్త మీద కాని (మేజర్ అయి వుంటే) ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. కేవలం వారి నుండి విడాకులు మాత్రమే తీసుకోవచ్చు. లేదంటే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. అక్రమ సంబంధం పెట్టుకున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చనేది నిజం కాదు.
Also Read:సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా..!