ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్ వాళ్లకు కాస్త చిన్నచూపు అనే మాట వాస్తవం. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఇలాగే ఉండేవారు. టాలీవుడ్ లో చాలా మంచి సినిమాలు వచ్చినా సరే బాలీవుడ్ నుంచి గుర్తింపు ఉండేది కాదు. కాని ఇక్కడి ప్రేక్షకులు మాత్రం అక్కడి సినిమాలను చాలా బాగా ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటుగా అక్కడి పెద్దలు కూడా బాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఇలా మన టాలీవుడ్ లో అడుగు పెట్టిన బాలీవుడ్ వాళ్ళ లిస్టు చూద్దాం.
సల్మాన్ ఖాన్
ఈ ఏడాది సల్మాన్ బాలీవుడ్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక్కడ వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో ఒక పాత్ర చేసారు. ఆ పాత్ర అంతగా ఆకట్టుకోలేదు అనే టాక్ వచ్చింది.
అనన్య పాండే
లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు. కాని సినిమా మాత్రం అనుకున్న విధంగా హిట్ కాలేదు. దీనితో మళ్ళీ బాలీవుడ్ వైపే వెళ్తుంది.
అనుపమ్ ఖేర్
బాలీవుడ్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ యాక్టర్ కార్తికేయ 2 సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. కనపడింది తక్కువే అయినా సరే ఆయన పాత్ర ఆకట్టుకుంది.
అలియా భట్, అజయ్ దేవగన్
ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఈ ఇద్దరూ టాలీవుడ్ లో అలరించారు. అలియా పాత్ర అంతగా ఆకట్టుకోలేదు గాని అజయ్ పాత్ర మాత్రం ప్రేక్షకులు మర్చిపోలేని విధంగా ఉంది.