బాహుబలి, పుష్ప లాంటి సినిమాలు వచ్చి భారతదేశంలో తెలుగు సినిమా సినారియోని మార్చాయి గానీ…తెలుగులో వచ్చిన కొన్ని సినిమాల వల్ల తెలుగు సినిమాపై అదర్ లాంగ్వేజ్ సినిమాకి ఉండే సద అభిప్రాయం అంతంత మాత్రమే..! టాలీవుడ్లో వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పటికీ పంటికింద రాయిలా తగులుతూనే ఉంటాయి.
రియాలిటికి దూరంగా ఊహలకు అందని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ బొక్క బోర్లా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో మచ్చుకు మోస్ట్ వాంటెడ్ సినిమాలు అంటే వెగటు పుట్టించే సీన్లున్న సినిమాలన్నమాట.!
కొన్ని మూవీస్ లోని ఫైట్ సీన్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురైవుతూనే ఉన్నాయి. అలా ఇండస్ట్రీ పరువు తీసిన కొన్ని సినిమాలు వాటిలోని ఫైట్ సీన్లు గుండె దిటవు చేసుకుని చూద్దాం.
1.పల్నాటి బ్రహ్మనాయుడు
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాలలోని ఫైట్ సీన్స్ ఇప్పటికీ ట్రోలవుతూనే ఉన్నాయి.బాలయ్య యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మానందరికి తెలిసిందే.
అయితే బాలయ్యను నెక్స్ట్ లెవెల్ యక్షన్స్ సీన్స్ లో చూపించాలని డైరెక్టర్ చేసిన అతి ప్రయత్నం అంటే బాలయ్య మానవమాత్రుడు కాదు, దాదాపు దైవాంశ సంభూతుడు అని చెప్పేందుకుపడ్డ తాపత్రయానికి నిదర్శనమే ఈ సినిమా.
బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని ఫైట్స్ ప్రేక్షకులకు కళ్ళు బైర్లు కమ్మెలా చేస్తాయి.తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, హీరో చిటికేస్తే కుర్చీ తో సహ విలన్ హీరో కాళ్ళ వద్దకు రావడం. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలోని యాక్షన్(ఓవర్) సన్నివేశాలకు కొరతే ఉండదు.
2.విజయేంద్ర వర్మ
నటసింహ నందమూరి నటించిన ఈ మూవీ కూడా సినీ ప్రేక్షకుల ఐక్యూ కు గట్టిగానే పరీక్ష పెడుతుంది. స్వర్ణ సుబ్బరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఫైట్స్ సీన్స్ చూస్తే అలా ఎలా జరిగింది అనే ఆశ్చర్యం కలుగక మానదు.ట్రైన్ కు హీరో అడ్డంగా దాటడం, కొండపై నుంచి హీరో జంప్ చేయడం ఇలా చాలా సన్నివేశాలు తలనొప్పి తెప్పించడం కాదు బొప్పికట్టిస్తాయి.
3.వినయ విధేయ రామ
రాంచరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ఫైట్ సీన్స్ కూడా లాజిక్స్ కు అందని రీతిలో ఉంటాయి. హీరో ట్రైన్ పై నిలబడి బిహార్ వరకు వెళ్ళడం, విలన్స్ ను నరికితే తలలను గద్దలు ఎత్తుకెళ్ళడం, విలన్ ను కాటేసిన పాము చనిపోవడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో ఓవర్ సన్నివేశాలకు కొట్టినపిండి ఈ ‘వినయ విధేయ రామ’.
4.శక్తి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరిక్షే పెడుతుంది. రొటీన్ స్టోరీకి కాస్త ఫాంటసీ టచ్ తో వచ్చిన ఈ మూవీలోని ఫైట్ సీన్స్ కూడా కాస్త అతిగానే ఉంటాయని చెప్పాలి.
ముఖ్యంగా విలన్ ను కారు గుద్దితే కారే నుజ్జు నుజ్జు అయిపోవడం, మితిమీరిన హీరో ఎలివేషన్స్ , తండ్రి పాత్రలోని ఎన్టీఆర్ గెటప్ ఇలా చాలా వాటిపైనే ట్రోల్స్ వచ్చాయి.
ఇంకా పవన్ కల్యాణ్ నటించిన బంగారం, మహేశ్ బాబు నటించిన సైనికుడు, అల్లు అర్జున్ నటించిన వరుడు. ఇలా ఆయా హీరోలు నటించిన చాలా సినిమాలలోని ఫైట్స్ లాజిక్స్ కు ఏమాత్రం అందవు.