చాలామంది హీరోలు, హీరోయిన్స్ కథ నచ్చకనో లేక వేరే వేరే కారణాలతోనో కొన్ని సినిమాలను రిజెక్టు చేస్తూంటారు. అయితే కొన్నిసార్లు అలా వదులుకున్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి. అలా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయం సాధించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించగా పూర్ణ కీలక పాత్రలో నటించారు. శ్రీకాంత్ విలన్ గా నటించగా జగపతిబాబు కీలక పాత్రలో నటించారు.
గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకు మించిపోయాయి. అయితే ఏ మాత్రం ఆ అంచనాలకు తగ్గకుండా బాలయ్య బోయపాటిఅఖండ సినిమా హిట్ అయింది. ఇకపోతే ప్రగ్యా జైస్వాల్ కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ కోసం నలుగురిని సంప్రదించారట మేకర్స్.కానీ వాళ్ళు వేరే వేరే కారణాల వల్ల నో చెప్పారట.
మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారట. బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు, జయ జానకి నాయక చిత్రాలలో రకుల్ హీరోయిన్ గా నటించింది. ఆ సెంటిమెంట్ తోనే రకుల్ ను సంప్రదించగా ఆమె నో చెప్పిందట. ఆ తరువాత హీరోయిన్ కాజల్ ను సంప్రదించారట. ఆమె కూడా వేర్వేరు కారణాలతో నో చెప్పిందట.
ALSO READ : కాజల్ తో పాటు గెటప్ శ్రీనును ఆచార్య నుంచి అందుకే తీసేసారా ?
దీంతో కేథరిన్ ను సంప్రదించాడట బోయపాటి శ్రీను. బోయపాటి సరైనోడు సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆమెను సంప్రదించాడట. కానీ ఆమె కూడా నో చెప్పిందట.
ALSO READ : హ్యాపీ డేస్ అప్పు…ఎలా మారిపోయిందో తెలుసా!! చూస్తే షాక్ అవ్వాల్సిందే
ఆఖరిగా పాయల్ రాజ్ పుత్ ను సంప్రదించారట మేకర్స్. ఆమె కూడా నో చెప్పటంతో ఎట్టకేలకు ప్రగ్యా జైస్వాల్ ను పెట్టి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.