సినీ స్టార్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిని చూసేందుకు జనాలు ఎగబడుతూ ఉంటారు. ఫోటోల కోసం పిచ్చెక్కి పోతుంటారు. కానీ కొంత మంది స్టార్స్ మాత్రం వాటన్నింటినీ ఇష్టపడరు. మామూలు జీవితం గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
అయితే చాలా మంది సినీ స్టార్స్ రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఆరోగ్య సమస్యల బారిన పడి పోరాడి కోలుకున్నారు.
మొదటిగా హీరోయిన్ షీలా కౌర్, అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరుగు లో సినిమాలో హీరోయిన్ గా నటించింది షీలా. ఆ తర్వాత సీతాకోకచిలుక, మస్కా, అదుర్స్ వంటి చిత్రాల్లో నటించింది. ఆతర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడింది. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ ద్వారా పూర్తి స్థాయిలో కోలుకుంది.
అలాగే మమతా మోహన్ దాస్ ఈ బ్యూటీ కూడా భయంకరమైన వ్యాధి బారిన పడింది. 25 ఏళ్లకే బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. దీనితో ఈమె భర్త వదిలేశాడు. అయినప్పటికీ మనోధైర్యంతో వ్యాధిని జయించింది.
ఆడవాళ్లు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ? వెనుక ఉన్న కథ ఇదే !
మరో హీరోయిన్ మనీషా కొయిరాల. కెరీర్ మంచి పీక్ లో ఉన్న టైంలో క్యాన్సర్ బారిన పడింది. సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ సినిమాలకు దూరంగానే ఉంటుంది.
ఇంకో బ్యూటీ సోనాలి బింద్రే, మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలో ఎవరూ గుర్తు పట్టని విధంగా తయారైంది. వ్యాధి పై పోరాటం చేసి ఎట్టకేలకు బయట పడింది.
Advertisements
మరో నటి గౌతమి, గౌతమి… బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ఆమె తల్లి కూడా క్యాన్సర్ తో మృతి చెందింది. అయినప్పటికీ గౌతమి మాత్రం పోరాడి విజయం సాధించింది.