అసలు పేర్లను సర్టిఫికెట్లలో మాత్రమే ఉంచుకుని నిక్ నేమ్ తో కొనసాగే నటులు చాలా మందిఉన్నారు. ఈ పేరు అలవాటైన మనకు.. అసలు పేరు.. ఎరువు తెచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అలా నిక్ నేమ్ తో ఫేమస్ అయిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ కృష్ణ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్.ల గురించి అందరికీ తెలుసు. వారి ఫేస్ లు చూడగానే ముందుగా ఈ పేర్లతోనే మాట్లాడుకుంటారు.
కానీ వీరితో పాటు కొందరు నటులకు రియల్ నేమ్స్ ఉన్నాయి. కొందరు అసలు పేర్లను షార్ట్ చేసి పిలుచుకుంటే.. మరికొందరు కొత్త నేమ్ ను తగిలించుకొని ఫేమస్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి:
స్వయం కృషితో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరు చిరంజీవిగా మారింది. చిరంజీవిగా పేరు మార్చుకున్న తరువాత ఆయనకు కలిసొచ్చింది. అప్పటి నుంచి ఈయన సక్సెస్ లైఫ్ ను కొనసాగిస్తూ వస్తున్నారు
సూపర్ స్టార్ కృష్ణ: అలనాటి హీరోల్లోఒకరైన కృష్ణ నటనకు ఓల్డ్ ఫ్యాన్స్ ఫిదా అవుతారు. ఆయన కుమారుడు మహేశ్ స్టార్ హీరో. మరో కుమారుడు నరేశ్, ఇతరులు కూడా సినిమాల్లోనే ఉన్నారు.
యాక్షన్ కింగ్ గా కృష్ణ అనేక సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ మూవీస్ తో పాటు డిఫరెంట్ రోల్ లో నటించిన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరమాకృష్ణ. ఆయన పేరు పెద్దగా ఉండడంతో కొందరు కృష్ణ అని పిలిచేవారట. అలా కృష్ణ సూపర్ స్టార్ కృష్ట అయ్యారు. విజయవంతమైన ఎన్నో సినిమాల్లో నటించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైన పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక.. వరుసహిట్లు కొట్టాడు. డైనమిక్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న పవన్ సినిమాలంటే క్రేజ్ ఉన్న ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్లో పవన్ కల్యాణ్ ను కళ్యాణ్ బాబు అని పిలిచే వారు. రాను రాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గా మారిపోయారు
నాని: ఎలంటి సినీ బ్యాక్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ‘అష్టా చమ్మ’ సినిమాతో హీరోగా మారి ‘అలా మొదలైంది’ సినిమాతో స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు.సినిమాల్లో అందరికీ నానిగా తెలిసినా ఆయన అసలు పేరు ఘంటా నవీన్ బాబు
ప్రభాస్: ‘ఈశ్వర్’ సినిమాతో ఫిల్మ్ నగర్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘బాహుబలి’తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకటసత్యనారాయణ ప్రభాస్ రాజు.
ఇలాగే మరికొందరి హీరోల స్క్రీన్- రియల్ పేర్లు:
రజనీకాంత్ – శివాజీరావ్ గైక్వాడ్
మోహన్ బాబు – క్తవత్సలనాయుడు
కమల్ హసన్- పార్థసారధి శ్రీనివాసన్
రవితేజ- భూపతిరాజు రవి శంకర్ రాజు
జగపతిబాబు- వీరమాచినేని జగపతిరావు
సునీల్- సునీల్ వర్మ
మమ్ముట్టి- మహమ్మద్ కుట్టి పని పరంబాల్ ఇస్మాయిల్