కొన్ని కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. అలాంటి సినిమాలు సినిమా పరిశ్రమను ఒక రేంజ్ కు తీసుకు వెళ్తూ ఉంటాయి. ఆ సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. ఇక ఆ సినిమాల జాబితా ఒకసారి చూస్తే…
Also Read:బప్పి మృతి… చిరు ఎమోషనల్ పోస్ట్
భక్త ప్రహ్లాద
మొదటి తెలుగు టాకీ సినిమా ఇది. ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ సంచలనాలు మొదలయ్యాయి. అప్పట్లో దీని షేర్ 50 వేలు. 1932 లో వచ్చింది ఈ సినిమా.
సావిత్రి
1933 లో వచ్చిన సావిత్రి సినిమా లక్ష రూపాయల షేర్ వసూలు చేసింది.
లవ కుశ
1934 లో వచ్చిన సినిమా 5 లక్షలు వసూలు చేసి షాక్ కి గురి చేసింది.
మాలపిల్ల
1938 లో వచ్చిన ఈ సినిమా పది లక్షల వరకు వసూలు చేసింది. హరిజన ఆడపిల్ల గురించి తీసిన సినిమా ఇది.
భక్త పోతన
1942 లో వచ్చిన ఈ సినిమా 20 లక్షలు వసూలు చేసింది. బయోగ్రఫీ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఈ సినిమాను తెరకెక్కించారు.
త్యాగయ్య
1946 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 25 లక్షలు వసూలు చేసింది. చితూరు నాగయ్య ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు ఆస్కార్ వచ్చే రేంజ్ ఉంది అంటారు.
బాలరాజు
1948 లో వచ్చిన ఈ సినిమా 30 లక్షలు వసూలు చేసింది. అక్కినేనికి ఇదే మొదటి హిట్
గుణ సుందరి కథ
1949 లో వచ్చిన ఈసినిమా 40 లక్షలు వసూలు చేసింది.
పాతాల భైరవి
మొత్తం 50 లక్షలు వసూలు చేసి ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ఈ సినిమా.
దేవదాసు
ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 1953 లో వచ్చిన ఈ సినిమా 55 లక్షలు వసూలు చేసి అక్కినేనికి రెండో హిట్ ఇచ్చింది.
రోజులు మారాయి
1955 లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. భార్యా భర్తల మధ్య అండర్ స్టాండింగ్ ఎలా ఉండాల్లో చెప్పింది ఈ సినిమా.
మాయా బజార్
ఈ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా చూస్తారు అభిమానులు. 1963 లోనే కోటి రూపాయల వరకు వసూలు చేసింది ఈ సినిమా.
దసరా బుల్లోడు
అక్కినేనికి ఈ సినిమా తిరుగులేని విజయం ఇచ్చింది. 1971 లో వచ్చిన ఈ సినిమా కోటిన్నర వసూలు చేసింది.
అల్లూరి సీతారామ రాజు
తెలుగు సినిమాలో ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాల్లి. 1974 లో వచ్చిన ఈ సినిమా రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన్ద్హి.
అడవి రాముడు
1977 లో వచ్చిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచే సినిమా రూటు మారిపోయింది. ఎన్టీఆర్ కు తిరుగులేని హిట్ ఇచ్చింది.
ప్రేమాభిషేకం
1981 లో వచ్చిన ఈ సినిమా అక్కినేని కెరీర్ లో మైలురాయి గా నిలిచింది అనే చెప్పాలి. 4.5 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
పసివాడి ప్రాణం
చిరంజీవి, విజయ శాంతి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా దాదాపు 5 కోట్లు వసూలు చేసింది.
యముడికి మొగుడు
1988 లో వచ్చిన ఈ సినిమా మొత్తం 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది
శివ
అక్కినేని నాగార్జున కు సూపర్ హిట్ ఇచ్చి కెరీర్ లో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది. అప్పట్లో ఈ సినిమా 5.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇలా చూసుకుంటూ పోతే జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, పెదరాయుడు, సమరసింహా రెడ్డి, నువ్వే కావాలి, నరసింహ నాయుడు, ఇంద్ర, పోకిరి, మగధీర వంటి సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఇక అత్తవారింటికి దారేది, ఆ తర్వాత వచ్చిన బాహుబలి రెండు భాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
Advertisements
Also Read:గురు రవిదాస్ ఆలయానికి మోడీ.. భక్తులతో కలిసి కచేరి..!