జీవితమనే ప్రయాణంలో సుఖదుఃఖాలు ఎలా వస్తుంటాయో… అదృష్టం, దురదృష్టం కూడా అలాగే వస్తూనే ఉంటాయి. అయితే ఎప్పుడూ ఏది మన జీవితంలో ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేరు. గడిచిన గతాన్ని, కదలిపోతున్న కాలాన్ని కూడా మార్చలేము. ఆచార్య చాణక్య మన జీవితంలో ఎటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా వివరించారు.
కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పిన సూత్రాలు పాటిస్తే వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. భార్య భర్తల మధ్య సమస్యలు గురించి, డబ్బు, స్నేహం, అదృష్టం, దురదృష్టం ఇలా ఎన్నో వాటి గురించి చాణక్య చెప్పారు. అలానే ఆచార చాణక్య జీవితంలో విజయం పొందడానికి కొన్ని విషయాలని చెప్పారు.
అయితే చాణక్య ఈ మూడు పరిస్థితులు కనుక వస్తే అది దురదృష్టమే అని అంటున్నారు. మరి ఆ పరిస్థితులు ఏమిటి..?, ఎలాంటివి ఎదురైతే దురదృష్టం అనేది ఇప్పుడు చూద్దాం.
1. వృద్ధాప్యంలో భాగస్వామి లేకపోవడం:
వృద్ధాప్యం భాగస్వామి దూరమైతే ఒంటరిగా జీవించడం చాలా కష్టం. ఇది నిజంగా దురదృష్టమే అని చాణక్య అన్నారు.
2. ఇంకొకరి ఇంట్లో ఉండడం:
కొన్ని కారణాల వలన ఒక్కొక్క సారి వేరొకరి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అది కూడా దురదృష్టానికి సంకేతమే. ఎవరి ఇంట్లో అయితే ఉంటున్నామో వాళ్ళ మీద ఆధార పడటం అక్కడ ఉండడం కష్టంగా వున్నా సర్దుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా దురదృష్టానికి సంకేతమని చాణక్య అంటున్నారు.
3. మోసపోయి డబ్బు కోల్పోవడం:
మనకి డబ్బు చాలా ముఖ్యం ఒక్కొక్కసారి మోసగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాము. ఇది కూడా దురదృష్టమే అని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు.