రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి ఆరెంజ్. మగధీర తర్వాత వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ ను బాగా ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోవడానికి ఆరు ప్రధాన కారణాలు ఉన్నాయి.
Also Read:రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు ఇవే…!
మగధీర ప్రభావం
ఆరెంజ్ కంటే ముందు వచ్చిన మగధీర సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఆ తరహా సినిమా ఆశించారు. కాని ఆరెంజ్ మాత్రం క్లాసికల్ సినిమాగా పేరు తెచ్చుకోవడంతో కథ కు కనెక్ట్ అవ్వలేదు.
ఇప్పుడు రావాల్సిన సినిమా
వాస్తవానికి ఆ కథ అప్పటిది కాదు. ఇప్పుడు వచ్చి ఉంటే సూపర్ హిట్ అయి ఉండేది. జనాల ఆలోచన అప్పట్లో ఆ సినిమాకు కనెక్ట్ కాకపోవడం బాగా ఇబ్బంది పెట్టింది. ప్రేమ అంటే ఆలోచన ఒకరకంగానే ఉండేది అప్పట్లో.
బడ్జెట్
యాక్షన్ సినిమా కాదు కాని బడ్జెట్ మాత్రం బాగా ఖర్చు చేసారు. 40 కోట్ల వరకు ఖర్చు చేయడం ఆ తర్వాత సినిమాను సరిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేకపోవడం బాగా ఇబ్బంది పెట్టింది.
మ్యూజిక్
సినిమా ఆడియో కి మంచి స్పందన రాగా… సినిమాపై కూడా అన్నే అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ విని సినిమాను ఇంకో రేంజ్ లో ఊహించుకున్నారు.
ప్రమోషన్
సినిమా ప్రమోషన్ కూడా అనుకున్న విధంగా జరగలేదు. యాక్షన్ సినిమా తరహాలో ప్రమోట్ చేయడంతో సినిమాను అలాగే ఊహించుకోవడం కథ మరో రకంగా ఉండటంతో జనాలకు అర్ధం కాలేదు.
పెద్ద సినిమాలు రిలీజ్ కావడం
అప్పట్లో ఈ సినిమా రిలీజ్ టైం లో పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా బృందావనం, రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర, మహేష్ బాబు ఖలేజా సినిమా, రగడ సినిమా, వెంకటేష్ నాగ వల్లి సినిమాలు అప్పుడే విడుదల అయ్యాయి. ఈ సినిమాల ప్రభావం ఆ సినిమా మీద బాగా పడింది.
Also Read:బ్రేకింగ్ : బావిలో పడ్డ కారు…నలుగురు మృతి