టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు… ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ చేసే సినిమా ఏదీ అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే మహేష్ బాబు కొన్ని సినిమాలను వదులుకోవడం ఆయనను కాస్త ఇబ్బంది పెట్టింది అంటారు. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
Also Read:మోడీ వల్లే సాధ్యం.. ఉక్రెయిన్ రాయబారి కీలక వ్యాఖ్యలు
యమలీల
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ… కృష్ణకు చెప్తే… ఆ కథ నచ్చి మహేష్ ను ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం చేయాలని భావించారు. కాని మహేష్ చదువు విషయంలో సీరియస్ గా ఉండటంతో స్టోరీ అలీ కి వెళ్ళింది.
నువ్వే కావాలి
స్రవంతి రవి కిషోర్ అప్పుడే సినిమా పరిశ్రమలోకి వచ్చిన మహేష్ ను ఈ సినిమా చేయాలని అడిగి… ఒరిజినల్ వెర్షన్ సీడీ కూడా పంపించారు. కాని మహేష్ ఆ స్టోరీ విషయంలో ఆసక్తి చూపించలేదు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఇడియట్
ఈ సినిమా విషయంలో పూరి చాలా మంది హీరోలతో మాట్లాడారు. వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. కాని మహేష్ ఆ కథ వద్దని చెప్పారు.
మనసంతా నువ్వే
ఎమ్మెస్ రాజు ఈ సినిమాకు ముందు మహేష్ ను అడగగా మహేష్ బాబు బిజీగా ఉన్నా అని చెప్పడంతో… ఉదయ్ కిరణ్ చేసాడు.
గజినీ
ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపిన గజినీ సినిమాను ముందు మహేష్ ను అడిగితే… ఆ కథ చేయలేను అని చెప్పడంతో వెనక్కు తగ్గారు.
లీడర్
రానాకు మంచి ఇమేజ్ తీసుకొచ్చిన ఈ సినిమాను ముందు మహేష్ ను అడగగా మహేష్ బాబు వద్దని చెప్పడం జరిగింది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని వద్దన్నారట.
ఏమాయ చేసావే
గౌతం మీనన్ కేవలం మహేష్ బాబు కోసమే ఈ సినిమా స్టోరీ రాసుకున్నాడు. మంజుల ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించాలని భావించారు. కాని మహేష్ ఖలేజా సినిమా విషయంలో సీరియస్ గా ఉండి ఇది వద్దన్నారు.
రుద్రమ దేవి
ఈ సినిమాలో అల్లు అర్జున్ చేయాలని భావించిన గోన గన్నారెడ్డి పాత్రను ముందు మహేష్ కోసం అడిగినా ఆయన వద్దన్నారట.
24
మొదటి సారి డబుల్ రూల్ చేసే అవకాశం మహేష్ బాబు కి వచ్చింది. మెయిన్ క్యారెక్టర్ లో మార్పులు చెప్పడంతో అది నచ్చని దర్శకుడు కథ ను సూర్య కు చెప్పాడు.
అఆ
నితిన్ కెరీర్ లో మంచి జోష్ తీసుకొచ్చిన ఈ సినిమా కథ అసలు రాసుకుంది మహేష్ బాబు కోసం. కాని డేట్స్ కుదరక ఈ సినిమాను వద్దని చెప్పాడు.
ఫిదా
వరుణ్ తేజ్ కెరీర్ కు బాగా హెల్ప్ అయిన ఈ సినిమాను ముందు మహేష్ బాబు కోసమే రాసుకున్నారు గాని మహేష్ వద్దని చెప్పడంతో వరుణ్ తేజ్ కు వెళ్ళింది.
గ్యాంగ్ లీడర్
నానీ గ్యాంగ్ లీడర్ సినిమాను ముందు మహేష్ బాబు కోసం అనుకుంటే వద్దంటే అప్పుడు నానీ చేసాడు.
పుష్ప
అల్లు అర్జున్ కెరీర్ లో ఒక రేంజ్ సినిమాగా నిలిచినా ఈ సినిమా విషయంలో ముందు సుకుమార్ మహేష్ బాబు కోసమే ఆలోచించినా మహేష్ వద్దనడం తో ఆ స్టోరీ అల్లు అర్జున్ చేసాడు.