ఒక సినిమా సక్సెస్ కావాలంటే కథతో పాటు సంగీతం కూడా చాలా ఇంపార్టెంట్. సినిమా పాటలు సక్సెస్ అయితే సినిమా సగం సక్సెస్ అయినట్టే. అయితే కొన్నిసార్లు సినిమా విజయం సాధించలేక పోయినా కొన్ని సాంగ్స్ మాత్రం హైలెట్ అవుతుంటాయి. అలా విడుదలైన తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ ని అందుకుని రికార్డులను సృష్టించిన సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా పెన్ని సాంగ్… సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు సంబంధించిన పెన్ని సాంగ్ విడుదలైన 24 గంటలలో 16.38 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ సాంగ్ కు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ సాంగ్ దూసుకుపోతుంది.
అలాగే కళావతి సాంగ్… ఈ సాంగ్ కూడా సర్కారు వారి పాట సినిమాలో పాటనే. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లో 14.7 8 వ్యూస్ ను సాధించింది.
పబ్ ఇష్యూపై స్పందించిన నిహారిక… వాగితే లాగిపెట్టి కొడతా
మూడవ పాట మా మా మహేష్… ఈ పాట విడుదలైన 24 గంటలలో 13.56 మిలియన్ వ్యూస్ సాధించింది.
ఇక నాలుగవ పాట అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలోనిది. సమంత ఆడిపాడిన ఊ అంటావా సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 12.39 వ్యూస్ ను సాధించింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
నిహారిక ఇష్యూపై స్పందించిన తల్లి పద్మజ… మాకు మా బావగారున్నారు!!
5వ సాంగ్ లాలా భీమ్లా సాంగ్ … సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విడుదలైన భీమ్లా నాయక్ సినిమా లోని సాంగ్ ఇది. ఈ సాంగ్ 24 గంటలలోనే 10.20 మిలియన్ వ్యూస్ సాధించింది. దగ్గుబాటి రానా కూడా హీరోగా నటించారు. నిత్యామీనన్, సంయుక్త లు హీరోయిన్స్ గా నటించారు.