కొన్ని కొన్ని సినిమాలు చూడటానికి మనకు ఎంతో వినోదాన్ని అందిస్తాయి. సినిమా కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఆ సినిమాలు టీవీ లో చూడటానికి బాగుంటాయి గాని థియేటర్ లో మాత్రం మాస్ ఆడియన్స్ కు ఏ మాత్రం నచ్చవు. దీనితో నిర్మాతలకు అసలు నచ్చవు ఆ సినిమాలు. ఇలా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టలేక ఇబ్బందులు పడ్డాయి.
Also Read:యుద్ధమా.. అబద్ధమా?
చూడటానికి బాగున్నా సరే బాక్సాఫీస్ డిజాస్టర్ గా నిలిచిన 5 తెలుగు సినిమాలను ఒకసారి చూస్తే…
ఖలేజా: మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు, త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీవీ లో వస్తే మాత్రం మిస్ అవ్వకుండా చూస్తారు.
అతడు: త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా పెద్దగా థియేటర్ లో ఆడలేదు. కాని సినిమా మాత్రం టీవీ లో వస్తే ఇప్పటికీ మిస్ అవ్వరు.
డాడీ, జై చిరంజీవ: ఈ సినిమాలు టీవీ లో వస్తే చూసారు గాని థియేటర్ లో చూడటానికి మాత్రం అసలు ఇష్టపడలేదు.
గౌతమి పుత్ర శాతకర్ణి: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించినా సరే హిట్ టాక్ తెచ్చుకోలేదు.
హ్యాపీ: అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది గాని మాస్ ఆడియన్స్ కు ఏ మాత్రం నచ్చలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే శర్వానంద్ నటించిన శ్రీకారం, ప్రస్తానం సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ నలుగురు, తోలుబొమ్మలాట మొదలైన సినిమాలు ఆకట్టుకోలేదు.