ఈ రోజుల్లో సినిమా అంటే లాభాలు అన్నట్టుగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు చేయడం వాటికి భారీగా లాభాలు ఆశించడం, సినిమా ప్రమోషన్ లు భారీగా చేయడం వంటివి జరుగుతున్నాయి. సినిమాల ప్రమోషన్ కూడా భారీగానే చేస్తున్నారు అని చెప్పాలి. మన తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చి భారీ లాభాలు వచ్చిన సినిమాల లిస్టు ఒకసారి చూద్దాం.
కార్తికేయ 2
ఈ సినిమాకు 45 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. సినిమా బాలీవుడ్ లో కూడా బాగా ఆడింది.
వాల్తేరు వీరయ్య
చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు 45 కోట్ల లాభం వచ్చినట్టుగా టాక్.
అల వైకుంఠపురములో
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బాగా ఆడిన సంగతి తెలిసిందే. ఏకంగా 75.88 కోట్ల లాభం వచ్చిందని టాక్.
ఎఫ్ 2
ఈ సినిమాకు దిల్ రాజుకి భారీ లాభం వచ్చింది. 40 కోట్ల వరకు లాభం వచ్చినట్టుగా టాక్.
రంగస్థలం
ఈ సినిమాకు 47.52 కోట్ల వరకు లాభం వచ్చింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు.