కమర్షియల్ సినిమాలకు తెలుగు ఆడియన్స్ పెద్దపీట వేస్తారు…ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కాస్త యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటే హీరో ఎవరు అనేది కూడా చూడరు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. అయితే చాలా మంది తమిళ హీరోలుకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా సూర్య అతని తమ్ముడు కార్తీ ఇద్దరికి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది.

తక్కువ టైంలోనే ఈ క్రేజ్ ని సంపాదించుకున్నారు ఈ ఇద్దరు. అందుకే వీరు నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఓ గమనించదగ్గ విషయం ఏంటంటే కార్తీ నటించిన ప్రతి సినిమాకి పాత తెలుగు సినిమా టైటిల్స్ ని పోలి ఉండే విధంగా టైటిల్స్ పెడతారు. అయితే అలా కార్తీ ఏఏ సినిమాలకు టైటిల్స్ పెట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం.
కాష్మోరా
నయనతార హీరోయిన్ గా కార్తీ హీరో గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ఇక 1986లో రాజేంద్రప్రసాద్ భానుప్రియ రాజశేఖర్ నటించిన సినిమాకు కాష్మోరా అనే టైటిల్ పెట్టారు.
చిన బాబు
2018లో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. రైతు గొప్పతనాన్ని చెబుతూ ఈ సినిమా తీశాడు. ఇక ఈ టైటిల్ తో 1988లో నాగార్జున అమల ఓ సినిమాలో నటించారు.
ఖైదీ
2019లో ఈ టైటిల్ తో కార్తీ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే గతంలో చిరంజీవి ఖైదీ టైటిల్ తో సినిమా చేశాడు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దొంగ
ఈ టైటిల్ తో కూడా చిరంజీవి సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించగా 2019లో ఇదే టైటిల్ తో కార్తీ సినిమా చేశాడు. ఈ సినిమాలో సూర్య భార్య జ్యోతిక కార్తీ కు అక్క పాత్రలో నటించింది.
ఖాకీ
ఈ టైటిల్ తో చాలా సినిమాలు తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక 2018లో కార్తీ ఈ టైటిల్ తో సినిమా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
అడవి శేషు హీరోయిన్స్ విషయంలో… కామన్ పాయింట్స్ గమనించారా ?
సుల్తాన్
నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. అయితే ఆ టైటిల్ తో కార్తీ కూడా గతేడాది సినిమా చేశాడు ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
సర్దార్
సీనియర్ ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ తో చిత్రాలను తెరకెక్కించారు. ఆ చిత్రాలను పోలిన టైటిల్ సర్దార్ తో కార్తీ సినిమాని తెరకెక్కించాడు.
ఎన్టీఆర్ కు జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే
మల్లిగాడు
ఈ సినిమా లో ప్రియమణి హీరోయిన్ గా నటించగా కార్తీ, ప్రియమణి ఇద్దరికీ నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి.
ఆ సినిమాలో పవన్ నో చెప్తే శ్రీకాంత్ నటించాడట!
దేవ్
కార్తీ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో శ్రీహరి హీరోగా నటించిన దేవా చిత్రాన్ని పోలి ఈ టైటిల్ ని పెట్టారు.
చెలియ
గౌతమ్ మీనన్, మాధవన్ అబ్బాస్ కాంబినేషన్ లో అప్పట్లో చెలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే టైటిల్ ను గుర్తుచేస్తూ కార్తీ మణిరత్నం చెలియా సినిమా తెరకెక్కించారు.