టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు అనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో జాతీయ స్థాయిలో మన హీరోలకు మంచి గుర్తింపు వస్తుంది. ఇలా ఇంస్టాగ్రామ్ లో ఎవరికి ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారనేది చూద్దాం.
అల్లు అర్జున్
ఫాలోవర్స్ లిస్టు లో బన్నీ టాప్ లో ఉన్నాడు. పుష్ప సినిమా దెబ్బకు బన్నీ రేంజ్ పెరిగింది. 19.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు. 17.7 మిలియన్ల ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రభాస్
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ 16 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన రామ్ చరణ్ కు 10.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబుకి 9.4 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.
నానీ
నాచురల్ స్టార్ నానికి ఇంస్టాగ్రామ్ లో 5.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇంస్టాగ్రామ్ లో 5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
రామ్
యంగ్ హీరో రామ్ పోతినేని కి ఇంస్టాగ్రామ్ లో 3.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ కి 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.