అక్టోబర్ నెల నుండి మూడు బ్యాంకుల అకౌంట్ హోల్డర్లు అక్టోబర్ 1 నుండి వారి చెక్ పుస్తకాలను మార్చాలి లేదా అప్‌డేట్ చేయాలి. అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల చెక్ పుస్తకాలు అక్టోబర్ 1 నుండి చెల్లవు. ఈ మూడు బ్యాంకులు ఇప్పుడు ఇతర బ్యాంకులలో భాగమైన విషయం తెలిసిందే.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్ల ప్రస్తుత చెక్ బుక్‌లు క్లోజ్ చేసేస్తున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెప్టెంబర్ ప్రారంభంలో ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం కొత్త మార్పులు అక్టోబర్ 1, 2021 నుండి వర్తిస్తాయి. భవిష్యత్తులో ఎటువంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే వినియోగదారులు తమ పాత చెక్ బుక్‌ను త్వరగా మార్చాలని రిక్వెస్ట్ చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పాత ఇ-ఓబిసి, ఇ-యుఎన్‌ఐ చెక్ బుక్ 1-10-2021 నుండి చెల్లదు. దయచేసి మీ పాత చెక్ బుక్ ఇ-ఓబిసి, ఇ-యుఎన్‌ఐని పిఎన్‌బి చెక్ బుక్ ను అప్‌డేట్ చేసిన పిఎన్‌బి ఐఎఫ్‌ఎస్‌సి, ఎంఐసిఆర్‌తో భర్తీ చేయండి” అని చెప్పుకొచ్చింది.
ఖాతాదారులు కొత్త చెక్ బుక్ కోసం స్థానిక బ్యాంకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ (ATM లు), ఇంటర్నెట్ బ్యాంకింగ్, PNB One లేదా సంబంధిత బ్యాంకుల అధికారిక కాల్ సెంటర్ల ద్వారా కూడా మార్పులు చేయవచ్చు. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800-180-2222 ని సంప్రదించండి. ఏప్రిల్ 2020 లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కలిసిపోవడం ఈ మార్పుకు కారణం.