సినీ నటులు సినిమాల విషయంలో హిట్టా? ఫట్టా అనేదే చూస్తారు.! అలా తమ కెరీర్ లోలో ఉన్నప్పుడు మంచి సినిమా ద్వారా తమకు హిట్ ఇచ్చిన దర్శకులకు భారీ కానుకలు ఇవ్వడం సినీ ఇండస్ట్రీలలో కామన్ . అలా దర్శకులకు కార్లను గిప్ట్ గా ఇచ్చిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం!
నితిన్ :
ఎన్నో ఫ్లాప్ సినిమాల తర్వాత నితిన్ కు ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన…. దర్శకుడు వెంకీ కుడుములకు నితిన్ 85లక్షల విలువగల రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు.
మహేష్ బాబు:
వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న మహేష్ బాబుకు కొరటాల శివ ‘శ్రీమంతుడు’ సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను ఇచ్చాడు. దీంతో ఉబ్బితబ్బిబైన ప్రిన్స్ కొరటాల శివకు….. 50 లక్షల విలువగల ‘న్యూ ఆడి ఎ6’ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.
3) ప్రభాస్:
ప్రభాస్ తన ఫిట్ నెస్ ట్రైనర్ అయిన లక్ష్మణ్ రెడ్డికి రూ.85లక్షల విలువ గల ఖరీదైన లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చాడు. బాహుబలి మేకోవర్ విషయంలో లక్ష్మణ్ ప్రభాస్ కు చాలా సహాయం చేశాడట!