నార్త్ కొరియా ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినబడుతున్న పేరు.! దానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన.! ఈ దేశంలో అమలయ్యే విధానాలు సైతం కొంత విచిత్రంగా, కొంత ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. మనం కంపల్సరీగా భావించే కొన్ని వస్తువులు ఆ దేశంలో నిషేదించబడ్డాయి….ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం!
1) ఐఫోన్ :
ఐఫోన్ యే కాదు ఆపిల్ కు సంబంధించిన వస్తువులు ఆ దేశంలో వాడకం నిషేదం…దీనికి కారణం దేశ ప్రజలు లగ్జరీ ఖర్చు చేయకూడదు
2) లగ్జరీ కార్లు :నార్త్ కొరియాలో దాదాపు 80% ప్రజలు తమ ప్రయాణాలకోసం…. ప్రజా రవాణా వ్యవస్థనే ఉపయోగిస్తారు.
3) ఇంటర్నెట్ వైఫై :
ముందుగానే అనుమతి తీసుకున్న వారికి తప్ప….మనలాగా ఫ్రీగా ఈ సదుపాయాలను వాడుకునే వెసులుబాటు లేదు. ఇంటర్నెట్ వ్యవస్థపై పూర్తిస్థాయిలో దేశ ప్రభుత్వ నిఘూ ఉంటుంది.
4) మైక్రోవేవ్, వాషింగ్ మెషిన్ , ఐరన్ బాక్స్ :
వీటిని వాడితే అధిక విద్యుత్ అవసరమౌతుంది…నార్త్ కొరియాలో అంత విద్యుత్ సరఫరా లేదు. వీటిని వాడాలంటే సెపరేట్ గా పవర్ జెనరేటర్ ను ఏర్పాటు చేసుకోవాల్సిందే!
4) టివి ఛానల్స్ :
కేవలం 10 ప్రభుత్వ ఛానల్స్ కే అనుమతి ఉంది. వాటిలో ప్రసారమయ్యే ప్రతి న్యూస్, షోస్ పై ప్రభుత్వ దృష్టి ఉంటుంది.