సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీర సింహారెడ్డి’ జనాలను బాగా ఆకట్టుకుంటోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అలాగే యూఎస్ లో కూడా రికార్డులు సాధించింది. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్య బాబు చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా.. నెగిటివ్ టాక్స్ కూడా వస్తున్నాయి. మరి ఆ నెగిటివ్ టాక్ కి కారణాలు అయిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొంత మంది సినిమా చాలా బాగుంది అంటే, మరి కొంతమంది మాత్రం, రొటీన్ స్టోరీ అంటున్నారు. కొంతమంది అయితే ఏదో ఒక్కసారి చూడగలిగే సినిమా అని అంటున్నారు. కానీ బాగా ఆశలు పెట్టుకుని వెళ్ళిన వారిని నిరాశపరిచింది అని కామెంట్స్ వస్తున్నాయి. బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో తండ్రి కొడుకులుగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నటించిన సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తండ్రి కొడుకులుగా వేరే ఏమైనా కాన్సెప్ట్ ఎంచుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దాదాపు ఇలాంటి స్టోరీతోనే ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా వచ్చింది.
అందులో కూడా పెద్ద బాలకృష్ణ పాత్ర కొంచెం ఇలాగే ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమా కూడా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా. దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా అలాంటివే. దీంతో వరుసగా యాక్షన్ సినిమాలే చేయడం ఎందుకని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కొన్ని సీన్స్ కూడా వేరే సినిమాలను గుర్తుకు తెచ్చేలాగా ఉన్నాయి అంటున్నారు.
అలాగే ఈ మూవీలో ఫైటింగ్ సీన్స్ లో లాజిక్ కూడా లేదనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ మరి కొంతమంది మాత్రం ఇలాంటివి అన్ని పట్టించుకోకుండా.. సినిమాని సినిమాలాగా చూడాలి అని అంటున్నారు. ఇక శృతి హాసన్, బాలకృష్ణల పెయిర్ అస్సలు సెట్ కాలేదంటున్నారు. ఇద్దరు హీరో హీరోయిన్లుగా చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉన్నారని, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా తెరపై బాగా కనిపించలేదని అంటున్నారు. అలాగే శృతి హాసన్ తో వచ్చే కామెడీ ట్రాక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందంటున్నారు జనాలు.
ప్రస్తుతం అయితే వీర సింహా రెడ్డి సినిమా థియేటర్లలో నడుస్తోంది. బాలయ్య బాబు అభిమానులకి నచ్చినా కూడా, సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా రొటీన్ గా అనిపిస్తుందనే టాక్ వస్తోంది. మొత్తానికి బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలుస్తాడా.. లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: కోటా శ్రీనివాసరావు ఆస్తుల గురించి షాకింగ్ కామెంట్స్…!