సినిమా పరిశ్రమకు భాషతో ఏ మాత్రం పని లేదు. అందంగా ఉంటే చాలు, మంచి నటన ఉంటే స్టార్ హీరోయిన్ దాదాపుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక విదేశాల వాళ్ళు కూడా మన దేశంలో మంచి సినిమాలు చేసారు. మనీషా కొయిరాల నుంచి జాక్వేలిన్ వరకు కొందరు హీరోయిన్లు మన ఇండియన్ సినిమాలో సందడి చేసారు. విదేశీ పౌరసత్వం ఉన్నా సరే ఇక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ హీరోయిన్ లు ఎవరో చూద్దాం.
మనీష కొయిరాల
20 ఏళ్ల క్రితం తన అంద చందాలతో మనీషా సంచలనాలు సృష్టించింది. ఈ అమ్మాయిది అసలు మన దేశం కాదు. నేపాల్ నుంచి వచ్చి బాలీవుడ్ లో స్టార్ అయింది.
కత్రీనా కైఫ్
హాంకాంగ్ లో పుట్టిన ఈ స్టార్ హీరోయిన్ కు ఇప్పటికీ డిమాండ్ అలాగే ఉంది. ఇటీవల విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న ఈమెకు హాంకాంగ్ పౌరసత్వం ఉంది.
అలియా భట్
లండన్ లో పుట్టిన ఈమెకు అక్కడి పౌరసత్వమే ఉంది. ఇక అక్కడి నుంచి ఉన్నత చదువులు చదివి హీరోయిన్ అయి ఆ తర్వాత రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ఈమెది మన పక్కనే ఉన్న శ్రీలంక. సల్మాన్ ఖాన్ ప్రోత్సాహంతో మన దేశంలో అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల వరుస కేసులు ఇబ్బంది పెడుతున్నాయి.