టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా నుంచి పాలిటిక్స్ వరకూ ఆయన డిఫరెంట్ థింకింగ్ తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక్కసారైనా పవన్ ను చూస్తే అనుకుంటూంటారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ లాగే ఆయన ఫ్యాన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. పవర్ స్టార్ తో ఒక్కసారైనా నటించాలని ఏ హీరోయిన్ అయినా అనుకుంటుంది. ఆయన సినిమాలో ఒక్కసారి క్లిక్ అయితే వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. అంతటి క్రేజ్ పవన్ సొంతం. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
1. దేవయాని:
1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, దేవయాని హీరోయిన్ గా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సుస్వాగతం’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో నటించిన దేవయాని ఆ తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితమైంది.
2. ప్రీతి జింగానియా:
సూపర్ హిట్ సినిమా ‘తమ్ముడు’లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన హీరోయిన్ ప్రీతి జింగానియా ఆ తర్వాత నరసింహనాయుడు, అధిపతి వంటి చిత్రాలలో నటించి ప్యాకప్ చెప్పేసింది.
3. సుప్రియ యార్లగడ్డ:
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ చిత్రంలో సుప్రియ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుప్రియ.. అడవి శేషు ‘గూఢచారి’ మూవీలో కీలక పాత్ర పోషించింది.
4. కీర్తి రెడ్డి:
తొలిప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించింది కీర్తి రెడ్డి. ఆ తర్వాత అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోను నటించలేదు.
5. అదితి గోవిత్రికర్:
తమ్ముడు చిత్రంలో లవ్లీగా బాగా ఫేమస్ అయిన అదితి ఆ తర్వాత ఏ సినిమాలోను నటించలేదు.
6. రేణు దేశాయ్:
రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో పవన్ కు జోడీగా నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలోను ఆమె నటించలేదు.
7. నేహా ఒబెరాయ్:
‘బాలు’ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన నేహా ఒబెరాయ్ ఆ తర్వాత జగపతిబాబుతో ఓ సినిమాలో నటించింది. ఇక ఆమె కూడా ప్యాకప్ చెప్పేసింది.
8. మీరా చోప్రా:
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘బంగారం’ సినిమాలో నటించిన మీరా చోప్రా.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితం అయింది.
9. నికిషా పటేల్:
‘కొమరం పులి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో “ఓమ్ 3d” లో నటించింది. ఆ తర్వాత ఈమె కూడా ప్యాకప్ చెప్పేసింది.
10. సారాజెన్ డియాస్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సారాజెన్. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ ఆమె కనపడలేదు.