సినిమావాళ్ళ క్రేజ్ జనాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ల విషయానికి వస్తే చూపు తిప్పుకోలేని అందంతో..ఒంపు సొంపుల దేహ సౌష్టవంతో ఉంటారు. అందుకే వారి అందానికి ముగ్ధులై పోతుంటారు అభిమానులు. వెండితెరపై వారి మనోహరమైన రూపాన్ని చూస్తూ ఉండిపోతారు. అయితే తమ అభిమాన తారలు పర్స్నల్ లైఫ్ లో ఎలా ఉంటారు. ఏం తింటారు. ఏది ఇష్టపడతారు లాంటి విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే వీటిలో వారు దేనిగురించి భయపడతారనే విషయం కాస్త ఇంట్రస్టింగానే ఉంటుంది. వారి భయాల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్లు కూడా మనలాంటి సాధారణ మనుషులేనన్న వాస్తవం బోధపడుతుంది. ‘తెనాలి’ సినిమాలో కమల్ హాసన్ భయాల చిట్టా విప్పినట్టు మనుషులకు రకరకాల భయాలుంటాయి. వింత వింతైన భయాలుంటాయి. నీటి భయం, నీడ భయం, చెట్టు భయం, పుట్ట భయం, పిట్ట భయం, పిడుగు భయం, పాము భయం ఇలా పెద్ద లిస్టే ఉంది. సినిమాల్లో డేరింగ్ డాషింగ్ క్యారెక్టర్లలో రెచ్చిపోయే హీరోయిన్లు వాస్తవ జీవితంలో మాత్రం చిన్న చిన్న వాటికి భయపడుతుంటారు. దీన్నే ఫోబియా అంటారు.మరి మన హీరోయిన్లను వెంటాడుతున్న ఫోబియాలు ఏంటి. వాటితో ఇబ్బంది పడుతున్నవారు ఎందరు అనే వివరాలు చూద్దాం.
హన్సికకు బ్యాక్టీరియో ఫోబియా ఉంది. ఎక్కడ నుంచి బ్యాక్టీరియా తన ఒంట్లోకి వెళ్లిపోతుందేమో అని భయపడుతుందట. అందుకే సినిమాల్లో లిప్ కిస్లకు నో చెప్పేస్తుందట ఈ భామ.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ను క్లిత్రో ఫోబియా వేధిస్తోంది. ఇది ఉన్నవారు ఎక్కడైనా చిక్కుకుపోతామేమో అని ఆలోచిస్తూ భయపడుతుంటారు. ఈమె లిఫ్ట్ ఎక్కినా కూడా దిగేదాకా లోపల వణికిపోతూనే ఉంటుందట.
కత్రినా కైఫ్ హెర్పటో ఫోబియా ఇంకా లైకోపెర్సిసోఫోబియా అనే రెండింటితో బాధపడుతోంది. మొదటిది బల్లులను చూస్తే కలిగే భయం. ఇక రెండోది వింటే ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడతారు. టమాటాలను చూస్తే భయమేస్తుందట.
అలియా భట్కు నిక్టోఫోబియా ఉంది. చీకటిని చూస్తే భయమేస్తుంది. చీకట్లో ఒంటరిగా ఉండాలంటే తనవల్ల కానేకాదు.
దెయ్యాలంటే భయపడేవాళ్లను ఫాస్మో ఫోబియా బాధితులుగా పిలుస్తారు. ఐశ్వర్య రాజేశ్ కు ఘోస్ట్ పేరు వింటేనే భయమంట.
టాలీవుడ్ చందమామ కాజల్ను ఆర్నితో ఫోబియా వెంటాడుతోంది. పక్షులంటే కాజల్కు చచ్చేంత భయం.
దీపికా పదుకొణెకు ఓపిడియో ఫోబియా ఉంది. పాము విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన భయం ఉంటుంది. కానీ దీపిక పాము పేరు వింటే చాలు వణికిపోతుందఎక్వినో ఫోబియా ఉన్నవారు గుర్రం ఎక్కాలంటే భయపడతారు. ప్రియాంక చోప్రాకు ఈ ఫోబియా పుష్కలంగా ఉంది. అందుకే సినిమాల్లో అలాంటి సీన్లు వద్దని చెబుతుందట.
తమన్నాకు అక్రో ఫోబియా ఉంది. ఇది ఉన్న వాళ్లు ఎత్తైన ప్రదేశాలంటే భయపడతారు.
త్రిష కూడా ఫాస్మో ఫోబియాతో బాధపడుతోంది. దెయ్యాలంటే ఈమెకు చాలా భయం. దాన్ని పోగొట్టుకోవడానికి దెయ్యం సినిమాల్లో నటించింది.
ఫోబియా విషయంలో తాప్సీ కూడా త్రిష ఫ్రెండే అనుకోవచ్చు. ఈమెకు కూడా దెయ్యాలంటే చాలా హడల్. అందుకే దాన్ని వదిలించకోవడానికి తాను కూడా హారర్ మూవీస్లో నటించింది.