మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా… సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్సి 15 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటంటే. ఈ సినిమాలో ఒక రైలు ఎపిసోడ్ వుంటుందట. ఇది సినిమాకే హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ రైలు ఎపిసోడ్ కోసం శంకర్ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నాడని టాక్. ఇక అందుకు సంబంధించి ఒక ప్రత్యేక రైలు సెట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారట.