టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుల్లో కమెడియన్ అలీ కూడా ఒకరు. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా ఎన్నో మంచి పాత్రలు చేసారు. ఇప్పుడు కాస్త రాజకీయాల్లో కూడా కాస్త రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో ఆయనకు ఒక పదవి కూడా వచ్చింది. ఇక సినిమాల్లో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించారు అలీ. అలీ డైరెక్టర్ గా కూడా ఒక సినిమా చేస్తారనే టాక్ ఉంది.
Also Read:రెజ్లర్లపై కోర్టులో పిటిషన్ .. తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్
బాల నటుడిగా సినిమాల్లోకి వచ్చిన అలీ ఆ తర్వాత కమెడియన్ గా స్థిరపడి ఎన్నో సినిమాలు చేసాడు. దాదాపు 1200 కు పైగా సినిమాలలో ఆయన నటించి మెప్పించారు. బ్రహ్మానందం తర్వాత ఆయనకు ఆ రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది అనే మాట వాస్తవం. సినిమాల్లో ఆస్తులు కూడా అలీ బాగానే సంపాదించాడు. సుమారు 800 కోట్లకు పైగా ఆస్తులు ఆయన సంపాదించారు అని టాలీవుడ్ లో టాక్.
కేవలం సినిమాలే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అలీ పెట్టుబడులు పెడతారనే టాక్ ఉంది. వ్యాపార రంగంలో కూడా అలీ బాగానే ఆస్తులు సంపాదించారు. నిర్మాతగా కూడా ఆయన సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మహమ్మద్ భాష అనే చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అలీ. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా కూడా అలీ పోటీ చేసే అవకాశం ఉంది.