సాధారణంగా దొంగలంతా దొంగతనం చేసి అక్కడి నుంచి జారుకుంటారు. ముఖ్యంగా తమ గురించి ఆధారాలు ఉండకుండా, సీసీ కెమెరాల్లో పడకుండా బయటపడతారు. కానీ, ఈ దొంగ మాత్రం అలా కాదు. తన దొంగతనం విజయవంతమైందని అక్కడే సంతోషంతో డ్యాన్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలోని ఓ హార్డ్ వేర్ షాపులో శుక్రవారం అర్థ రాత్రి చోరీ జరిగింది. షాపు షట్టర్‌ను దొంగ పగులగొట్టి లోపలికి ప్రవేశించి.. కొన్ని వస్తువులతోపాటు కొంత నగదు దొంగలించాడు. అనంతరం షాపులోనే సంతోషంతో డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత పగులగొట్టిన షట్టర్ కింద నుంచి బయటకు వెళ్లిపోయాడు.
కాగా, మరునాడు హార్డ్‌వేర్ షాపునకు వచ్చిన యజమాని షట్టర్ పగులగొట్టి ఉండటం చూసి చోరీ జరిగినట్లు గ్రహించాడు. వెంటనే షాపులో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాడు. దీని ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో షాపు ఓనర్ ఫిర్యాదు చేశాడు. కొన్ని వస్తువులతోపాటు రూ.6,000 నగదును దొంగ చోరీ చేసినట్లు అందులో పేర్కొన్నాడు. అయితే, దొంగ ముఖానికి ముసుగు వేసుకుని ఉండటంతో అతడు ఎవరు అనేది తెలియలేదు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ను మనోజ్ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయటంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
यूपी में अब चोर चोरी के बाद जश्न मना रहा है चंदौली में @chandaulipolice आपकी कोई ज़िम्मेदारी है क्या ? @adgzonelucknow pic.twitter.com/RTnNJdScEa
— Manoj KAKA (@ManojSinghKAKA) April 18, 2022
Advertisements