హైదరాబాద్ అల్వాల్ లో దొంగలు బీభత్సం సృషించారు. అప్పటికే కొట్టేసిన కారుతో… ముగ్గురు దొంగలు ఓ ఎటీఎం సెంటర్ ను దోచుకునేందుకు విఫల యత్నం చేశారు. కానీ అది ఫలించలేదు. దాంతో… ఓ నగల షాప్ ను దోచుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అప్పటికే పోలీసులకు సమాచారం అందటంతో… పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దొంగిలించిన కారు అనుమానస్పదంగా కనపడటంతో, స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి వాకబు చేసేలోపే ఎస్సైపైకి దూసుకొచ్చారు. దాంతో పోలీసులు ఆ కారును ఫాలో చేయగా… దూలపల్లి ఫారెస్ట్ లో దొంగిలించిన వాహనం ఓ చెట్టుకు డీకొంది. దాంతో ముగ్గురు దొంగలు పరారయ్యారు. ఆ కారులో మరణాయుధాలు, గ్యాస్ కట్టర్ లను పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » కొట్టేసిన కారుతో… ఎస్సైపైకి.